పార్లమెంటు సమావేశాలు నేడు నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా మరోసారి చర్చగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బిజూ జనతా దళ్ నేతలు పట్టుబట్టారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్జేడీ, జేడీయూలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో వైసీపీ ఎంపీలు కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజన జరిగిన సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. ఎన్డీఏ పక్షాలు జేడీయూ, ఎల్జేపీ లు కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎన్డీఏ పక్షంగా ఉన్న టీడీపీ మాత్రం ఎందుకు మౌనంగా ఉందని వివిధ పక్షాలు అంటున్నాయి .. కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. కూడా ఈ వ్యవహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలగుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పడం విశేషం . అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల్లనలోనే ఈ విధంగా డిమాండ్ చేస్తున్న వైసీపీ ..తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు ఏమి చేసింది అని టీడీపీ నేతలు అంటున్నారు .. 22 మంది ఎంపీలు ఉన్నా ..కేంద్రాలన్నీ ఎందుకు హోదాపై ప్రశ్నించలేదు అనే దానిపై వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉండి ..గత మోడీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేసిన వైసీపీ .. ప్రత్యేక హోదా ని మాత్రం పట్టించుకోలేదు .. వాస్తవానికి వైసీపీ గత ఎన్నికల్లో భాయ్ మెజార్టీతో గెలిచిన తర్వాత లోక్ సభతో పాటు రాజ్యసభలో బలం పెరిగింది ..అది ఎన్డీయే ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా మలచుకునే స్థాయిలో వుంది. అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు, ఆర్టీఐ, జమ్మూకశ్మీర్ విభజన బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులతోపాటు వ్యవసాయ బిల్లు వంటివి వైకాపా మద్దతు లేకుంటే పాస్ అవడం కష్టం . అయితే వాటికి ప్రతిఫలంగా జగన్ ప్రత్యేక హోదా అడిగి ఉంటే రాష్ట్రానికి ఆ హోదా దక్కేది. కానీ అలాంటి అవకాశాలను రాష్ట్రం కోసం కాకుండాజగన్ సొంత అవసరాల కోసం వాడుకున్నారని ఇదే కాంగ్రెస్ నేతలు అంటున్నారు . ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే తాము కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిస్తామని జగన్ షరతు విధించి ఉంటే రాష్ట్రానికి తప్పనిసరిగా హోదా దక్కేదని నాటి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ సైతం అన్నారు . అంతేకాదువిజయసాయిరెడ్డి మోదీని విమర్శించే సాహసం చేయలేక కాంగ్రెస్‌పై నిందలు వేశారని … తనకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ అయిదేళ్లలో ఏం సాధించారో చెప్పాలని అన్నారు ..అంటే జగన్ ఐదేళ్లు హోదా కోసం చేసింది ఏమి లేదు .. కానీ ఎన్డీయే కి సహకరించారు ..అదే డిమాండ్ చేస్తే హోదా వచ్చేదేమో .. ఇప్పుడు టీడీపీ కూటమిలో వుంది .. ఇటీవలే ప్రభుత్వం ఏర్పడింది .. కొంత సానుకూల ధోరణిలో వెళ్ళాలి .. ముఖ్యంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్ధిక సాయం అవసరం .ఆ దిశగా అడుగులు వేసి ..రాష్ట్రాన్ని గదిలో పెట్టుకొని ..ఆ పై హోదా గురించి మాట్లాడాలి .. విజయసాయి చెప్పినట్టు టీడీపీ బయటకు వస్తే నిధులు రావు ..రాష్ట్రము సర్వనాశనం అవుతుంది ..తాము నాశనం చేసింది కాకుండా ఇంకా అలానే కావాలని బహుశా వైసీపీ కోరుకుంటుంది ఏమో ..తాము అధికారంలో ఉండగా నిద్రపోయి ఇప్పుడు ఆవేశ పడటం కరెక్ట్ కాదని వైసీపీ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.
© 2024 GoldAndhra | All Rights Reserved