Sai Dharma Tej : సినీ నటుడు సాయి ధర్మ తేజ్ విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం రూ.2 లక్షల చెక్కును అందించారు.
విజయవాడకు వచ్చి వరద బాధితులను పరామర్శించినట్లు తెలియజేస్తూ, దుర్గమ్మను దర్శించుకుని వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించానని తెలిపారు. తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమని చెప్పారు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తత మరియు బాధితులను రక్షించేందుకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా ఉందని, ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసారు. కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో ప్రత్యేక అనుబంధం ఉందని, వృద్ధాశ్రమం అభివృద్ధికి తన సహాయం అందిస్తానని చెప్పారు.