వైసీపీ పాలనలో అన్న క్యాంటీన్ల ను పూర్తిగా మూసేసారు ..
గత ప్రభుత్వం హయాంలో అన్ని నాశనం చేసారు .. అందరికి అన్నం పెట్టె అన్న క్యాంటీన్ల ను ధ్వంశం చేసారు … అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చూసింది .. దానితో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్ల పై స్పెషల్ ఫోకస్ చేసింది .. దానిలో భాగంగా ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్ చెప్పారు. సూపర్-6కు కట్టుబడి ఉన్నామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు… ఆగస్టు-15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు… ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని కూడా ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐఏఎస్సులుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల అన్నారు.
పని చేయకుంటే గ్యారెంటీ లేదని…ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం అని గుర్తు చేశారు చంద్రబాబు… ఇంకా కాలేకర్స్ కి ఇదొక వార్నింగ్ లాగా కూడా అంటున్నారు .. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే పదవులకు కూడా నష్టం అని చెప్పఁగానే చెప్పారు అనుకోవాలి.. అయితే బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయన్నారు. .. రీ-సర్వేను హోల్డులో పెట్టామని…. సర్వే రాళ్లను గెలాక్సీ గ్రానైట్ రాళ్లతో వేశారని జగన్ సర్కార్ పై మండిపడ్డారు.
తన ఫొటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రానైట్ రాళ్లు వేశారని.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంభించాలని కోరారు. ఐదేళ్లల్లో రూ. 1.64 లక్షల కోట్ల మేర పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. పేదల సేవలో అనే కార్యక్రమం కింద కలెక్టర్లు, అధికారులు పేదలతో మమేకం కావాల నికోరారు. . మీరు ఏదైనా పొరపాటు చేస్తే .. మన ప్రభుత్వానికి మచ్చ వస్తుందని చెప్పుకొచ్చారు … ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవాలని కూడా సూచించారు .. అయితే సీఎం చంద్రబాబు. కలెక్టర్ల పనితీరు.. ప్రభుత్వం మీద పడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని…. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని పేర్కొన్నారు…