ఏపీలో వేగవంతంగా రాజకీయాల్లో కీలక మలుపులు వస్తున్నాయి ..
ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు జగన్ ఎత్తుకు పై ఎత్తు వేసి
కూటమి తో చేతులు కలిపి బారి మెజారిపోటితో విజయాన్ని చవిచూశారు … అయితే ఐదేళ్లు గా జగన్ చేసిన అరాచకాలకు ముగింపు కలిపి మళ్ళీ
ఏపీ లో పూర్వవైభవం తెస్తానని హామీ ఇచ్చారు .. జగన్ అధికారం కోల్పోయిన తరువాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇవ్వడంతో రాబోయే కాలంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. జగన్ పై ఉన్న పాత కేసులకు కొత్త కేసులు తోడు కావడంతో ఆయన జైలుకెళ్లడం ఖాయమని వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. అదే జరిగితే వైసీపీ కనుమరుగు అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు.. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం సహకారం ఉండటంతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. మరో వైపు వైఎస్ షర్మిల దూకుడు వైసీపీ నేతలను వణికిస్తోంది. షర్మిల దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేయకుంటే వైసీపీని వీడటమే బెటర్ అనే నిర్ణయానికి ఆ పార్టీ ముఖ్యనేతలు వచ్చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది…
ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో జగన్ పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ టైం లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టింది. . దాని తరువాత షర్మిల పై వైసీపీ నేతలు సోషల్ మీడియా లో తప్పుగా మాట్లాడి షర్మిలను అవమానించారు … దానికి షర్మిల కౌంటర్ కూడా ఇచ్చింది …
అయితే వైసీపీ ఓటమి తరువాత వైఎస్ అభిమానులను కాంగ్రెస్ లోకి ఆహ్మానించేందుకు షర్మిల, కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే జరిగితే జగన్ పార్టీ కుప్పకూలిపోతుంది …
ముఖ్యంగా జగన్ అరాచకాలు భరించలేక జనం చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో చంద్రబాబు సీఎంగా అంగీకరించని వాళ్లు వైసీపీకి ఓటు వేశారు అని చెప్పింది . నిజానికి వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ వే అని షర్మిల వివరంగా చెప్పారు. అంతేకాక.. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసిన జీవోపై వైసీపీ పెద్ద రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, షర్మిల గతాన్ని గుర్తుచేస్తూ జగన్ మెహన్ రెడ్డి, వైసీపీ నేతలు నోరెత్తకుండా చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్నికల ప్రచార సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత పథకం అమలుపై దృష్టి కేంద్రీకరించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయించిందని వైసీపీ నేతలు పెద్ద రాద్దాంతం చేశారు. ఆ విషయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా వైసీపీ నేతలు తమ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. ఈ సమయంలో వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి మాత్రమే పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారని షర్మిల ప్రశ్నించారు.