ఏపీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తుంది .. చంద్రబాబు ఇచ్చిన మాట మీద ఉంటారు అనేది నిజం ..అయన ఏదైనా చేయాలి అనుకుంటే … చేసి తీరతారు ..
అయితే ఇచ్చినా హామీల్లో అమరావతి ఒకటి .. దానిపై చంద్రబాబు ఆలోచన ఒక దారిలో పెట్టి .. అమరావతి పూర్తి చేసే పనిలో మునిగిపోయారు ..తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వేగంగా అడుగులేస్తోంది.. ఇందులో భాగంగా నిన్న జరిగిన సీఆర్డీయే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అమరావతి పై ఫోకస్ చేయాలనీ ..చంద్రబాబు చెప్పుకొచ్చారు .. ఇందులో ప్రధానమైనది గతంలో నిర్ణయించిన అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మార్పుల్ని సరిదిద్ది అప్పటి ప్లాన్ ను యథాతథంగా అమలు చేయడం, ఇందులో సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి మరోసారి సింగపూర్ ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయాలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది .. సీఎం చంద్రబబు , పవన్ కళ్యాణ్ దీన్ని త్వరగా పూర్తి చేసి జగన్ కి బుద్ది చెప్పాలని .. చూస్తున్నారు .. అయితే ఇప్పుడు సింగపూర్ తిరిగి అమరావతికి వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది…
అయితే టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం 2016లో సింగపూర్ ప్రభుత్వ సాయంతో కొన్ని సంస్ధలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ముందుకొచ్చాయి… దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో వేగంగా పనులు ముందుకు సాగాయి. ..అయితే చంద్రబాబు అధికారం కోల్పోవడంతో పరిస్దితి మారుతూ వచ్చింది… దానితో సింగపూర్ కన్సార్టియం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీనికి కారణం ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ సర్కారే… 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఆరు నెలల్లోనే అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది… కానీ దానిపై ద్రుష్టి పెట్టకుండా .. అమరావతిని పక్కన పెట్టారు .. అంతే కాదు సింగపూర్ తో గత చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేసింది. దీంతో సింగపూర్ కూడా చేసేది లేక వెనక్కి తగ్గింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ తో సన్నిహితంగా మెలిగి, రాజధాని ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఆ తర్వాత అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని తెరమరుగయ్యారు.