మహేష్ బాబు ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ లో పూనకాలే … ఒక వైబ్రేషన్ …
నటనలో దిట్ట … అన్నింటికీ మించి అందగాడు … టాలీవుడ్ లో ప్రతిఒక్కరు మహేష్ బాబు ను చూసి కుళ్ళుకుంటారు … 40 పదుల వయసు దాటినా అయన ఇంకా యంగ్ గానే కనిపిస్తారు .. కాగా మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9న రాజమౌళి సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఉంటుందని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించేలా ఉంటుందని టాక్ .. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమాపై అప్డేట్ వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ డీలా పడ్డారు అని సమాచారం ..
దీనిపైఅభిమానులు కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని విషయాలు తెలిశాయి. ప్రస్తుతం జక్కన్న వర్క్ షాప్ పనుల్లో బిజీగా ఉన్నారు అని తెలిసింది .. . ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్స్ తో పాటు, అవుట్ డోర్ లో తీయాల్సిన కొన్ని సన్నివేశాలు … స్టంట్ మాస్టర్స్, రైటర్స్, ముఖ్యమైన టెక్నీషియన్స్ తో కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది…అందుకే రాజమౌళి ఈ సినిమా విషయంలో తొందరపడడంలేదని తెలుస్తుంది … చూద్దాం అన్ని సెట్ అయితే త్వరలోనే సెట్స్ మీదకి వస్తుంది ..
హీరో బర్త్ డే కాబట్టి మంచి అకేషనే అనుకున్నా అసలు షూటింగే ఎప్పుడు మొదలుపెట్టాలో ఇంకా స్పష్టత లేనప్పుడు తొందరపడటం దేనికని భావించారట. దానికి మహేష్ మద్దతు తెలుపడంతో కేవలం మురారి రీ రిలీజ్ తోనే ఫ్యాన్స్ సరి పెట్టుకోవాల్సి ఉంటుంది అనే భావన కూడా మొదలయింది … దాన్ని ముందే గుర్తించి ఆ సినిమా తాలూకు వీడియోలు పాటలతో క్లిప్పులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.
అయితే ఇంకొక విషయం ఏంటంటే .. . రాజమౌళి అడిగితే ఎవరూ కాదనరు కానీ డేట్ల విషయంలో సరైన ప్లానింగ్ తో లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందు ఆర్టిస్టులను లిస్ట్ అవుట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ అందుబాటుని చెక్ చేసుకోబోతున్నారు. అడవి నేపథ్యంలో జరిగే స్టోరీనే అయినప్పటికీ ఈసారి రాజమౌళి ఫాంటసీ టచ్ ఇవ్వబోతున్నారని తెలిసింది. అదెలా ఉండబోతోందనేది అంత సులభంగా బయట పడేది కాదు … కానీ బోలెడు టైం ఉందిగా వెయిట్ చేద్దాం… ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో …