సింగర్ నోయల్ గురించి అందరికి తెల్సిందే … మంచి రాప్ సింగర్ అనే చెప్పాలి ..నోయల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు … గేమ్ కూడా తగ్గకుండా ఫైట్ ఇచ్చాడు .. ఇదంతా ఓకే కానీ అసలు సంగతికి వస్తే … సింగర్ నోయల్ కి పెళ్లి అయ్యి విడాకులు అయినా సంగతి కూడా మనకి తెలుసు … తన మాజీ భార్య ఎస్తేర్ నోరాన్హ
గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… గతంలో ఈ బ్యూటీ ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. 1000 అబద్ధాలు అనే సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.. దానితో అమ్మడు టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసింది … అవి పెద్దగా తనకి గుర్తింపు ఇవ్వకపోయినా హీరోయిన్ గా రాణిస్తుంది … ఈ మధ్య
ఎక్కువగా ఎస్తేర్ బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు తక్కువగానే వచ్చినప్పటికీ కీలకమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉండేది…
ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఎస్తేర్ తన మాజీ భర్త నోయల్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది ..పెళ్లయిన కేవలం 16 రోజులకే నోయల్ నిజస్వరూపం బయటపడింది. అతను అస్సలు మంచివాడు కాదు. నన్ను చాలా టార్చర్ చేసేవాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు కూడా సింపథి కోసం నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎస్తేర్. ప్రస్తుతం ఎస్తేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.దీనిపై నోయల్ ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే..