ఏపీ లో కూటమి బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుండి ..
జగన్ చేసిన తప్పులను కక్కించే పనిలో మునిగిపోయారు ..
అధికారం ఉంది కదా అని రఫ్ఫాడించారు .. చివరికి ప్రజలు
ఫుట్ బాల్ న్నీ తన్నినట్లు తన్నాడు .. జగన్ వికెట్ అవుట్ .. దానితో వైసీపీ లో నేతలు సతమతమవుతున్నారు … అధికారంపొయే …
పదవులు పోయే .. దానితో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు వైసీపీ శ్రేణులు .. అయితే మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా తన పని తాను చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు .. అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే .. తేడా వస్తే తాటతీస్తారు కాబట్టి ప్రజల కోసం పని చేస్తున్నారు నాదెండ్ల ..
ముఖ్యంగా రేషన్ విషయంలో కూడా ఔకతవకలు జరిగిన షాపుల పైన, గోడౌన్ల పైన కూడా ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాలలో చెకింగ్ చేయడం జరిగింది… అయినా అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు .. పొగరు నెత్తికెత్తి కొట్టుకున్నారు .. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని ప్రాంతాల నిర్మిస్తున్న కాలనీలను కూడా పరిశీలించారు.
పేదల కోసం లేఅవుట్లను అక్కడ ఇళ్ల స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తోంది నాదెండ్ల .. ముఖ్యంగా అధికారులను , లబ్ధిదారులను మరి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు, గృహ నిర్మాణంలో అవినీతి జరిగినట్లుగా ఆయన దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేదల కోసం కేటాయించిన భూములు ఇల్ల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏ ఒక్కరిని వదిలిపెట్టమంటూ తెలియజేశారు… అయితే లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకొని పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు కూడా మరో రెండు వారాలు గడువు ఇస్తామని పనులు మొదలు పెట్టకపోతే కచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు… లేదంటే అందరి బ్రతుకులు బయటకొస్తాయని తెలియజేసారు ..
లబ్ధిదారులు కూడా తమకు మంజూరైన స్థలం ఎక్కడ ఉందో తెలియదని చాలామంది తెలియజేస్తున్నారు అంటూ మనోహర్ వెల్లడిస్తున్నారు. అలాగే లబ్ధిదారులకు వారి యొక్క స్థలాలు తెలిపే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. .