సెన్సషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టారు ఈ కాంబినేషన్ … మళ్ళి అదే తహారలో హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ..అయితే ఈ సినిమాలో కేసీఆర్ ను అవమానించే … ఒక డైలాగ్ ఉందని ..దీనిపై రచ్చ షురూ అవుతుంది ..
ముఖ్యంగా ఈ సినిమా వచ్చే నెల ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న డబుల్ ఇస్మార్ట్ చుట్టూ పెద్ద వలయమే ఏర్పడుతోంది. పోటీపరంగా ఎదురవుతున్న సవాళ్లు కఠిన పరీక్ష పెట్టేలా ఉన్నాయి.. ఆగస్ట్ 15 రావాలని తంగలాన్ నిర్ణయించుకోవడంతో ప్యాన్ ఇండియాలో మంచి రిలీజ్ దక్కించుకోవాలని చూస్తున్న పూరి బృందానికి తమిళనాడు, కేరళలో చిక్కొచ్చేలా ఉంది. ఇక్కడేమో ఆయ్, 35 చిన్న కథ కాదు లాంటి చిన్న సినిమాలు సైతం బరిలో నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేవు. వీటి వెనుక గీతా ఆర్ట్స్, సురేష్, ఏషియన్ లాంటి పెద్ద సంస్థల అండదండలు ఉండటం ప్రధాన కారణం.
రవితేజ మిస్టర్ బచ్చన్ ప్రకటన కూడా ఏ నిమిషమైనా వచ్చేలా ఉంది. ఇంకా పాట షూటింగ్ జరుగుతున్నా ఓటిటి ఒప్పందం ప్రకారం ఆగస్ట్ 14 లేదా 15 థియేటర్ రిలీజ్ చేయాలనే ఒత్తిడిలో పీపుల్స్ మీడియా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్… ఇవన్నీ ఒకేసారి రిలీజ్ అయితే పూరి కి బొక్క పడట్లే అంటున్నారు ..
వాటన్నిటిని దాటుకొని రామ్ , పూరి ఈ సినిమాతో హిట్ అందుకుంటారా లేదా చుద్ద్దాంమ్ … ముఖ్యంగా ఇది నార్త్ మార్కెట్ లో ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఇదంతా ఛేదించుకోవాలంటే డబుల్ ఇస్మార్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాల్సిందే. రామ్, పూరి జగన్నాధ్ ఇద్దరూ వెనుక సినిమాలతో సక్సెస్ లో లేకపోయినా ఇస్మార్ట్ శంకర్ కున్న బ్రాండ్ భారీ బిజినెస్ తీసుకొచ్చింది. అరవై కోట్ల దాకా థియేటర్ హక్కులు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ లో టాక్ ఉంది.