టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి సరిగా ఆఫర్స్ ఉండవని … ఎప్పటి నుండో వినిపిస్తున్న న్యూస్ …తెలుగు వాళ్లకు కొంచం టైం సెన్స్ … పొగరుగా వ్యవహరిస్తారని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొందరు చెప్పుకొస్తారు …అయితే హీరోయిన్ అంటే అందాలు ఆరబోయాలి … అలాగే తమ అందాన్ని కాపాడుకోవాలి … సినిమాల్లో అవకాశాలు రావాలంటే ..? ఎక్కువ కాలం కొనసాగాలంటే …గ్లామర్ గా కనిపించాలి …
అయినా ఆఫర్స్ వస్తాయని రూల్ లేదు … నచ్చితే ఛాన్స్ లేదా ఆఫర్ లేదు … కొందరు తారలు అందం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని .. ప్లానింగ్ చేసుకుంటారు ..అయితే వారు ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తారు … ఏ హీరోయిన్ ఎంత సంపాదిస్తుందో తెల్సుకుంద్దాం ..
సక్సెస్ లో ఉన్నప్పుడు హీరోయిన్లకు డిమాండ్ పీక్స్ లో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఫేంలో ఉన్నంత కాలమే బాగా సంపాదించుకోని వెనకేసుకోవాలి అన్న రూల్ ప్రకారమే దాదాపు హీరోయిన్లు అందరూ కూడా పనిచేస్తారు.ఆరంభంలో హీరోయిన్ల కెరీర్ వేల నుంచి మొదలవుతుంది. ఆ తరువాత లక్షలకు, కోట్లకు పడగెత్తుతుంది. అలా కెరీర్ ప్రారంభించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. నటి త్రిష ఒక్కో సినిమాకి 6 నుంచి 10 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల విలువ 100కోట్లు.. అలాగే పూజాహెగ్డే ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకూ డిమాండ్ చేసేది. ప్రస్తుతం పూజాహెగ్డే ఆస్తుల విలువ దాదాపు రూ.55 నుంచి రూ.60 కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా.
అలాగే కాజల్ అగర్వాల్ నాలుగు కోట్ల మధ్యలో తీసుకుంటుంది. ఈమె ఆస్తుల విలువ రూ.60 నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటాయట. ఇక రష్మిక మందన్నసినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటోందట. ఆమె ఆస్తుల విలువ రూ.70 నుంచి రూ.80 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.. ఇంకా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు రూ.3.5 కోట్ల దాకా తీసుకుంటుందట. ఆమె ఆస్తుల దాదాపు విలువ రూ.50 నుంచి రూ.55 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల దాకా తీసుకుంటుందని సమాచారం. ఆమె ఆస్తుల దాదాపు విలువ రూ.50 కోట్లకుపైగా ఉంటుందిట. ఇక నయనతార మె 10 నుంచి 12 కోట్లు తీసుకుంటుందట.ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.. సమంత 8 కోట్లు పారితోషికం తీసుకుంటుండగా, ఆమె ఆస్తుల విలువ 110 కోట్లు ఉందిట. ఇక అనుష్క శెట్టి 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఆస్తులు రూ.135 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తమన్నా సినిమాకు ప్రస్తుతం రూ.5 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.140 కోట్ల వరకు ఉంటుందట..