సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదగడం అసాధారణ విషయం ..ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో నెంబర్ 1 గా ఎదిగాడు చిరు… సాధించాలనే సంకల్పం బలంగా ఉంటె .. అనుకున్న సక్సెస్ అందుకోవడం .. అనుకున్న రంగంలో అగ్రస్థానంలో ఉండటం సాధ్యం కాదని చాటిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ..అందుకే సామాన్యులకి అయన ఇన్స్పిరేషన్ .. కష్టపడే తత్వానికి అయన ఒక డెఫినేషన్ .. నటనలో వినూత్న ప్రయోగాలకి ఆయనే ఒక ఇన్నోవేషన్ .. పని పట్ల అయన డెడికేషన్ .. సినీ రంగంలో ఒక సెన్సేషన్ .. ఓ మామూలు కానిస్టేబుల్ బిడ్డగా … ఏమీ లేని కుటుంబం నుంచి అన్నీ ఉన్న స్థాయి కి చేరుకున్న అయన జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం అయింది .. అందుకే అయన జీవితం మనకు ఏమి నేర్పుతుంది … మనం ఏమి నేర్చుకోవాలి ..ఆయన జీవన ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
అయన బయోగ్రఫీ ఇప్పటికే ఎందరో ..ఎన్నో సార్లు చెప్పారు .. అయితే దానిని నుంచి మన భవితకు ఎలా బాటలు వేసుకోవాలి ..సామాన్యులు ఏదైనా సాధించే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం .
మెగాస్టార్ చిరంజీవి .. తెలుగు ప్రేక్షకులకి ఆ పేరొక సమ్మోహన శక్తి .. ఓ సెన్సేషన్.. ఓ ప్రభంజనం.. అయితే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు .. తాను అనుకున్న లక్ష్యానికి చేరడానికి అహర్నిశలు కష్టపడ్డారు . సినీ రంగంలో అవకాశాలు అందుకోవడం .. అత్యన్నత స్థానానికి చేరుకోవడం అంత సులువు కాదు .. కానీ కష్టాన్ని ఇష్టంగా భావించి లక్షాన్ని చేరిన అయన ప్రయాణం అందరికి ఆదర్శం . సినీ రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ..ఎందరికో బ్యాక్ బోన్ గా నిలిచిన చిరంజీవి .. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావ్, అంజనమ్మ దంపతులకు జన్మించారు. డిగ్రీ పూర్తి పూర్తి చేసుకొని నటన పై ఆసక్తి 1976లో చెన్నై వెళ్ళి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు . 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు . అప్పటికే సినీ రంగంలో గొప్ప గొప్ప నటులు ఎందరో ఉన్నా.. తనని తాను నమ్మి .. తనపై తానూ నమ్మకం ఉంచి ..ఈ రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో తన సినీ ప్రస్థానానికి బలమైన పునాది రాళ్లు వేసుకున్నారు . మొదటి సినిమా నుంచి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ .. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే చిన్న చిన్న పాత్రలు సైతం పోషించారు .. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూపించి .. ఆ తగ్గుదలే .. తన ఎదుగుదలకి సోపానంగా మార్చుకున్నారు .. కొన్ని సందర్భాల్లో తగ్గడం కూడా ఎదగడానికి ఒక మార్గం అని చిరు ద్వారా మనం తెలుసుకోవచ్చు .. తాననుకున్న గమ్యాన్ని చేరగలనని త్రికరణశుద్ధిగా నమ్మి … అవరోధాలు , ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే క్రమంలో హెచ్చుతగ్గులు ఉంటాయని ..వాటిని దాటుకొని ముందుకు సాగాలని చేసి చూపించారు . చిరు తనని తాను మలచుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటనలు , సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ..
చిత్రసీమలో తోలి అవకాశం అందుకునే ముందు .. చిరంజీవి.. హరిప్రసాద్, సుధాకర్‌లతో కలసి ఉండేవారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ.. తమ సినిమాల ప్రివ్యూలు చూసి, రివ్యూలు ఇవ్వమని వీరికి చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా చూడటానికి వీరు ప్రివ్యూ ధియేటర్ కి వెళ్లారు ..అయితే అక్కడే అనూహ్యమైన..అనుకోని పరిణామం ఎదురయింది .. ఆ సినిమా హీరోగా డ్రైవర్, మేకప్‌మ్యాన్ ల కోసం వీరిని సీట్లలో ఉంచి లేపారు . అది చిరు ఎంతో అవమానంగా భావించారు ..అంతేకాక హీరోగా ఎదగాలని అప్పుడే సంకల్పించాడు .. సినిమా ఎలా ఉందని నిర్మాణ సంస్థ వారు అడిగితె.. ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గరే నిలబెట్టాడు. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని ఆవేశంతో అన్నాడు .. . చివరకు నెంబర్ వన్ అయి చూపించారు .. పంతం తో ఒకటి సాధించాలని పట్టుబడితే .. అది సాధ్యం చేసుకోవడం పెద్ద కష్టం కాదని చాటిచెప్పాడు ..
ఇక సినీ రంగంలో అప్పటికే ఎందరి హీరోలు ఉన్నారు .. వాళ్ళని అనుకరిస్తే ..అనుసరిస్తే తనకు ప్రత్యేకత ఏముంది అని భావించి .. నటనలో , డ్యాన్స్ లో , యాక్షన్ లో దూకుడు పెంచి .. నాటి యువతరానికి సరికొత్తగా కనిపించి .. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు .. అంతేకాదు అప్పటివరకు డ్యాన్స్ లు అంటే ఉన్న అభిప్రాయాన్ని మార్చి .. తెలుగు సినిమా డ్యాన్స్ లకే క్రేజ్, గ్రెస్ తీసుకువచ్చారు ..అయితే సినీ డ్యాన్స్ లోను ప్రత్యేకత చాటడానికి ఒక సంఘటనే కారణం . తన డ్యాన్స్ ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఆ సినిమా మేనేజర్ ని అడిగితె .. గ్రూప్ డ్యాన్సర్లు చేసిందే నువ్వు చేశావ్ .. . నీ ప్రత్యేకత ఏముంది అన్నారు . అప్పటి నుంచి ఇతరులకి భిన్నంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.. చేసే పనిలోప్రత్యేకత , కొత్తదనం ఉండాలని చాటి చెప్పారు ..
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలనని కూడా నిరూపించుకున్నారు .. ఓ పక్క యాక్షన్ చిత్రాలు చేస్తూనే .. చంటబ్బాయి వంటి కామెడీ సినిమాలు చేశారు .. శుభలేఖ అనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు .. స్వయంకృషి వంటి చిత్రంలో తన విభిన్న నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే కాక . మొట్టమొదటిసారిగా నంది అవార్డు అందుకున్నాడు.. ఇక చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ‘ఖైదీ’కి ముందు.. తర్వాత అని చెప్పవచ్చు . 1983లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ రంగంలో సంచలనం సృష్టించింది .. చిరంజీవికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. సినీ రంగంలో చిరు ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరం చేరారు .. సుప్రీమ్ హీరోగా , మెగాస్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్నారు .. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ లు అగ్ర హీరోలుగా రాణిస్తున్న సమయంలో.. చిరంజీవి శరవేగంగా దూసుకువచ్చి .. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎవరి అండా లేకుండా.. టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనం అధిరోహించిన చిరంజీవి ప్రస్థానం .. . ఇండస్ట్రీకి రావాలనుకున్న ఎందరికో స్ఫూర్తిదాయక .. సరికొత్త స్టెప్పులతో… కొత్త ఫైటింగ్ లని పరిచయం చేసి… తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించిన చిరంజీవి టాలీవుడ్ పరిశ్రమకు పరుగులు నేర్పారు . భారతీయ సినీ చరిత్రలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోగా చిరంజీవి చరిత్ర సృష్టించారు . ఎన్నో విజయాలు సాధిస్తున్నే.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే గొప్ప తత్త్వం చిరు వ్యక్తిత్వంలో కనిపిస్తుంది .
సినిమాలే కాదు సేవలలోను మేటి అని చాటుకున్నారు .. బ్లడ్ బ్యాంక్ . ఐ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవలు అందించారు .. కరోనా కాస్త సమయంలో.. తెలుగు రాష్ట్రాలలో… ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులోకి తీసుకువచ్చి ఎందరికో ప్రాణం పోశారు. ఇండస్ట్రీ కార్మికులకు నిత్యవసర వస్తువులు అందించారు … కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సినీ ఇండస్ట్రీ ని నమ్ముకున్నా వారు కుటుంబాలను ఆదుకున్నారు .
అలాగే రాజకీయ పరంగా కూడా చిరంజీవి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు .. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ రంగంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయినా.. నమ్ముకున్న సిద్ధాంతాలని పాటించిన నేతగా ప్రత్యేకత చాటుకున్నారు .. 2009 ఎన్నికలలో ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు . ఇక ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేస్తూ .. చే సమాజంలోను ప్రజలను ఆదుకుంటూ ఉన్న చిరంజీవి… తన ఫ్యామిలీలో అనేకమందికి లైఫ్ ఇచ్చారు. చాలా మంది ప్రముఖ హీరోల ను… తెలుగు ఇండస్ట్రీకి అందించారు. చిరంజీవి ప్రజలకు అనినిత్యం సహాయం చేస్తూ.. వారిని సినిమాలతో అలరిస్తూ.. రాజకీయాల నుండిసినిమారంగంలో రీఎంట్రీ ఇచ్చి .. ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల స్పీడ్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో దూసుకుపోతున్నారు .. ఇండస్ట్రీలో సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ … తన . స్వయంకృషితో పట్టుదలతో అత్యున్నత శిఖరాలను అందుకుని సామాజికంగా, సినిమాల పరంగా… ఎవరు అందుకోలేని శిఖరాలను అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కృషి , పట్టుదల , సాధించేలానే సంకల్పం ఉంటె .. ఎవరైనా తాము అనుకున్న రంగంలో అత్యున్నత స్థాయిని అందుకుంటారని చేసి చూపించి .. ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు ..