తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే అటూ ఏపీలో ఇటూ తెలంగాణలో ఓటమిపాలైన పార్టీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది… ఆ పార్టీ లో నాయకులూ కూడా పార్టీ ని వీడుతున్నారు … దానితో ఏపీ లో ఇటు తెలంగాణ లో టెన్షన్ మొదలయింది .. ముఖ్యంగా కేసీఆర్ లో బాగా భయం పెరిగింది …
ఏపీ కూటమి ప్రభుత్వం కాస్త ఆలస్యమైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అందరికి అందే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ముందుకు కదులుతుంది … అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం హస్తిన వేదికగా ధర్నా చేస్తున్నారు.. ఈధర్నా జగన్ ను ఇరకాటంలో పెట్టెల పరిస్థితి ఉందని అందరు భావిస్తున్నారు … జగన్ ఢిల్లీ ధర్నాతో వైసీపీ ఇరుక్కుపోయింది… ఇప్పుడు బీజేపీ దగ్గరకు వెళ్లలేదు. కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేదు… బీజేపీ దగ్గరకు వెళ్తే అటు కాంగ్రెస్ ఇక జన్మలో నమ్మదు. ఎందుకంటే.. కష్టాల్లో ఉన్నాడని తమ కూటమి సభ్యులందర్నీ జగన్ కు మద్దతుగా పంపించింది.
కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. అంతటి ద్రోహం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన చేరితే
కాంగ్రెస్ కరుణిస్తుందా అంటే లేదనే చెప్పాలి ..
కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. ఆ బలం కాంగ్రెస్ నుంచే లాక్కున్నారు. అయినా ప్రస్తుత రాజకీయాల కారణంగా జగన్ ను దగ్గరకు తీయాలనుకుంటోంది. రాబోయే రోజుల్లో జగన్ అత్యంత దారుణమైన పరిస్థితిలు ఎదుర్కుంటారు ….కొత్తగా వివేకా హత్య కేసు కూడా చుట్టుకునే అవాకాశం ఉంది. ఇక అధికారం ఉందని విచ్చలవిడిగా నాకేసిన జనం సంపద వ్యవహారంలో సాక్ష్యాలు కళ్లెదురుగా ఉన్నాయి. లిక్కర్ స్కాంపై ఇప్పటికీ సీఐడీ విచారణకు ఆదేశించారు. డబ్బుల లొసుగులు బయట పెట్టి ఈడీకి సమాచారం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డి నుంచి మొత్తం కక్కించారు. ఇక ఇసుక వ్యవహారం నేరుగా సుప్రీంకోర్టు వద్దనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం చేయడానికి కావాల్సినన్ని ఆయుధాలు ఎన్డీఏ కూటమి వద్ద ఉన్నాయి.