హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదానికి నా దగ్గర ఆధారం ఉంది. నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను లీగల్‌గానే వెళతాను న్యాయం జరిగే వరకు పోరాడుతా అంటూ ప్రకటించాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లావణ్య తమను వేధిస్తోందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. తాజాగా ఇందులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. లావణ్య తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి అనే అమ్మాయి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని.. ఆమె వల్ల చాలామంది జీవితాలు నాశనం అయ్యాయంటూ పిటిషన్లో తెలిపింది. ఇక ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న ఎస్ఐ సుఖేందర్‌రెడ్డి దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
అయితే ఇదే తరుణంలో రాజ్ తరుణ్ కి మద్దతుగా ఆయన స్నేహితుడు ఆర్ జె శేఖర్ భాషా లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. పలు ఇంటర్వ్యూల్లో, న్యూస్ డిబేట్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల మీడియా ముందు శేఖర్ భాషా ని లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చ అయింది. అయితే తాజాగా లావణ్య – రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. . లావణ్య కి డ్రగ్స్ అలవాటు ఉందని, చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందని ఆరోపించాడు. ఈ క్రమంలో తమకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు లావణ్యపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. లావణ్య తమకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ప్రీతీ, ఉదయ్ లు ఇచ్చిన కంప్లైంట్ ని పరిశీలించి నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేయాలా .. వద్దా అనేది డిసైడ్ చేస్తామని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.