Andhra Pradesh latest news : ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అసలు పేర్లను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ఆర్ సహా వైకాపా నేతల పేర్లను జగన్ ప్రభుత్వం పెట్టింది.
ఈ నేపథ్యంలో వారి పేర్లను మారుస్తూ సంకీర్ణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు పేరు మార్చారు. ఈ ఉత్తర్వును గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారించారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మార్చారు. మొత్తం 12 ప్రాజెక్ట్‌లకు వాటి అసలు పేర్లు ఉంటాయి.