ఏపీ లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు వాటిపైనే వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు .. సోషల్ మీడియా ప్రెస్ మీట్స్ పెట్టి చంద్రబాబు ను ప్రశ్నించే పనిలో పడ్డారు .. కానీ సీఎం చంద్రబాబు నాయుడు వాటినేమి లెక్క చేయకుండా అభివృద్ధి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు .. దానిలో భాగంగా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెల్సుకొని పరిస్కరిస్తున్నారు … హామీల విషయంలోకి వెళ్తే ..!
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, వాలంటీర్లకు 10 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ యువత, వాలంటీర్లను ఎంతగానో ఆకట్టుకుంది… దానితో చంద్రబాబు గెలుపుకు అదొక కారణం అవుతుంది ..అలాగే నిరుద్యోగ యువత 20 లక్షలకు అటూఇటుగా ఉన్నట్టు ఒక అంచనా ద్వారా వెల్లడవుతోంది. రాష్ట్రంలో దాదాపుగా లక్షన్నర మంది వాలంటీర్లు ఉన్నారు. మొత్తం 22 లక్షల మంది బాబు హామీల అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ చంద్రబాబు
2014 సంవత్సరంలో నిరుద్యోగులకు హామీని ప్రకటించి చివరి ఆరు నెలలు అమలు చేశారు. ఆ సమయంలో వెబ్ సైట్ లో కొన్ని పొరపాట్ల వల్ల అర్హత ఉన్నా కొన్ని నెలలు నిరుద్యోగ భృతి పొంది మరికొన్ని నెలలు నిరుద్యోగ భృతి పొందని వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఈ ఏడాది చివరి నాటికి ఈ హామీని అమలు చేస్తారని టాక్ వినిపిస్తుంది .. చూద్దాం నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా … జగన్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని కోపంతో ఈసారి జగన్ ను గద్దె దింపారు …
మరొక హామీ లోకి వెళ్తే ?
చంద్రబాబు నాయుడు తమ జీతాలను రెట్టింపు చేసి జీవితాలను మార్చేస్తారని వాలంటీర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వాలంటీర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయడం సులువైన విషయం అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.