Home » ఏ మంత్రికి ఏ శాఖయితే బాగుంటుంది?

ఏ మంత్రికి ఏ శాఖయితే బాగుంటుంది?

by malakapalli
0 comment
AP-Minister - Gold Andhra

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది. బుధవారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ సహా పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే విషయంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం రాత్రే కేటాయిస్తారని అనుకున్నా, ఇప్పటివరకు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటదనే చర్చ మొదలయ్యింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఉపముఖ్యమంత్రి పదవి ఖాయం అయింది. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కోరుకుంటున్నట్టుగా జనసేనాని హోం శాఖ మంత్రి తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయనకు పాలుపంచుకోవాలంటే రెవిన్యూ శాఖ లేదా గ్రామీణభివృద్ధిశాఖ కట్టబెడితే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ గా ఉన్న నారా లోకేశ్ కి ఐటీ పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయన అమెరికాలో చదువుకోవడం, పరిశ్రమలపై ఆయనకు ఉన్న అనుభవం, చదువు అమరావతి ప్రపంచ నగరంగా ఎదిగేందుకు పునాదులు పడే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే కింజరపు అచ్చెన్నాయుడికి హోం శాఖ ఇస్తే బాగుంటుంది. అంతకముందు స్పీకరగా చేసిన అనుభవంతో పాటు సౌమ్యుడిగా, మేథావిగా పేరు తెచ్చుకున్న నాదేండ్ల మనోహర్ కి ఆర్థిక శాఖ అప్పగిస్తే బాగుంటుంది. బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ అప్పగించాలి. విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన పొంగూరు నారాయణకు విద్యా, వైద్య విభాగంలో మంత్రిపదవి ఇవ్వడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఆయనకు పౌరసరఫరాల శాఖ అప్పగిస్తే బాగుంటుంది. టీచర్ గా పని చేసి అంచలంచెలుగా ఎదిగిన వంగలపూడి అనితకు విద్యాశాఖ ఇవ్వాలి. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కి దేవదాయ శాఖ, నిమ్మల రామానాయుడికి రవాణశాఖ, ఎండీ ఫరూఖ్ కి మైనారిటీ సంక్షేమ శాఖ, సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణరెడ్డికి వ్యవసాయశాఖ, పయ్యావుల కేశవ్ కి ఆరోగ్య శాఖ అప్పగించాలి. డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరపై విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న మంత్రి సంధ్యారాణికి ఎస్టీ సంక్షేమ శాఖ ఇవ్వాలి. పెనుగొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎస్. సవితకు మహిళా,శిశు సంక్షేమ శాఖ అప్పగించాలి. గొట్టిపాటి రవికుమార్ కి గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, కొలుసు పార్థసారథికి సమచార ప్రసరాల మంత్రిత్వాశాఖ, కందుల దుర్గేశ్ సినిమాటోగ్రఫీ, డోలా వీరంజనాయస్వామికి ఎస్సీ సంక్షేమం, టీజీ భరత్ కి క్రీడా మంత్రిత్వ శాఖ, మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ, వాసంశెట్టి సుభాష్ కి ఎక్సైజ్ శాఖ, అనగాని సత్యప్రసాద్ కి విద్యుత్ శాఖ, బీసీ జనార్థన్ రెడ్డికి గనులశాఖ ఇవ్వాలి. కీలకమైన పాలన వ్యవహారాలతో పాటు భారీ నీటిపారుదల మంత్రిత్వ శాఖ కూడా చంద్రబాబు నాయుడు తన వద్దే ఉంచుకోవాలి. పోలవరం నిర్మాణం ఈసారయినా పూర్తవ్వాలంటే అది చంద్రబాబు దగ్గర ఉండటమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved