ప్రస్తుతం ఉద్యోగుల కి పని వేళలు పెంచాలని ఆ ప్రభుత్వం ఆలోచనలో ఉంది.. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి 12 గంటలు పని చేయాలనీ రూల్ సిద్ధం చేస్తుంది … అయితే ఇదెక్కడి కథ .. ఏంటి అనేది చూద్దాం ..
కర్ణాటకలో ఉద్యోగులకు తిప్పలు తప్పవ్ అంటున్నారు … ఆ ప్రభుత్వం చేస్తున్న పని తప్పు అని ఉద్యోగులు ధర్నాలకు దిగారు… అయితే
ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 12 గంటలకు మించి పెంచాలని కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. కర్ణాటక ఐటీ సంస్థలు పని వేళలను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ చర్యను ఉద్యోగుల సంఘం వ్యతిరేకించింది.. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మరో సవరణ చట్టం వివాదం రేపింది.తాజాగా కన్నడిగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పారిశ్రామికవేత్తలు తప్పుబట్టారు… ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగుల పట్ల కర్ణాటక సర్కార్ వ్యవహారిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రమంతా ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలతో మారుమోగుతోంది. సీఎం సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా కర్ణాటక సర్కార్ ఉద్యోగుల విషయంలో వివక్ష ఎందుకు చూపుతోంది..? పనిగంటలకు పెంచడానికి కారణమేంటి..? అసలు బయట రాష్ట్రాల ఉద్యోగులను ఎందుకు తరలించాలనుకుంటుంది..? ఉద్యోగులు కర్ణాటక రాష్ట్రాన్ని వదిలి వచ్చేస్తే పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లాభం చేకూరుతోంది…? అనే విషయాలను తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలో ఐటి ఉద్యోగుల పనివేళల్లో మార్పులు కలకలం రేపుతున్నాయి .. దీనికోసం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1961ని సవరించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పై ఐటీ రంగ సంఘాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది ఉద్యోగులపై ఉంటుందని అన్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్టైమ్తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సంఘటనలతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ ఎంప్లాయిస్ తమ సొంత రాష్ట్రాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కొంతమంది అర్చీలను పెట్టుకోగా మరి కొంతమంది మాత్రం మనసుకి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ఉద్యోగాలు తమకు వద్దని రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కొన్ని ఐటీ కంపెనీలు సైతం ప్రభుత్వ షరతులకు వ్యతిరేకంగా ఉన్నాయి.ఇదే క్రమంలో ఆ కంపెనీలలో కొన్ని వెనక్కి వెళ్ళేందుకు రెడీ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పొరుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలకు చెందిన ఐటీ శాఖ మంత్రులు ఆ కంపెనీలను తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ఐటీ కంపెనీల ఏర్పాటుకు వైజాగ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో వెను తిరిగేందుకు సిద్ధంగా ఉన్న మూడు నాలుగు కంపెనీల నిర్వహకులతో ఇప్పటికే లోకేష్ టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది వాళ్లు ఓకే అంటే.. ఒప్పందం చేసుకునేందుకు నారా లోకేష్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఏపీ సర్కార్ కి కేంద్ర సపోర్ట్ కూడా ఉండడంతో కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లేందుకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో ఆ రాష్ట్రానికి నిధులను కేటాయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో పరుగులు పెట్టనుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే నారా లోకేష్ ఇంకాస్త కర్ణాటక కంపెనీలపై కాన్సెంట్రేట్ చేస్తే తప్పనిసరిగా ఆ కంపెనీలు ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది… అంతేకాకుండా ఈ కంపెనీలతో ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ మార్గం ఈజీ అవుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు పబ్లిక్ మీటింగ్లలో ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నామంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే హైదరాబాదులో కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాగే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. పైగా మెట్రో కూడా ఉంది. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు సూపర్ గా రన్ అవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే కొన్ని కంపెనీలు హైదరాబాద్ వైపు చూసే అవకాశం లేకపోలేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వారం కంపెనీల కోసం పోటీపడుతున్నారే గానీ అక్కడ పనిచేస్తున్న తమ రాష్ట్రానికి చెందిన ఉద్యోగుల కు తమ మద్దతును ఇప్పటివరకు ప్రకటించలేదు.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 20 లక్షల మంది ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. ఇదంతా అక్కడ సీఎం సిద్దరామయ్య కావాలనే చేస్తున్నారని కొనే ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి షరతులతో కూడిన ఉద్యోగం కల్పించడం ద్వారా చాలామంది ఉద్యోగులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతారని అప్పుడు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందని..ఇంత డ్రామా ఆడుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.