దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి… మార్చి 16న అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారణ పేరుతో రిమాండుకు తరలించారు. 100 రోజులు దాటినప్పటికీ ఆమెకు బెయిల్ విషయంలో అనేక ఇబ్బందులు తప్పడంలేదు.. కవిత విచారణ రోజు రోజుకి వెనక్కి వెళ్తుంది … ఈ కేసు లో బీజేపీ హస్తం ఉందా .. కేసీఆర్ అంతటివాడికి కూడా కూతుర్ని బయటకి తీసుకురావడనికి సాధ్యం కావడం లేదా … కావాలనే కేసీఆర్ మౌనం గా ఉన్నారా? మొన్నటివరకు ఎలెక్షన్స్ కాబట్టి కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని అందరు అనుకున్నారు … కానీ లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ ఘోరఅపజయం చూసింది … అంతా సర్దుమణిగింది కవితను జైలు నుండి బైలు మీద బయటికి తీసుకురావడనికి కేటీఆర్ , కేసీఆర్ నానా కష్టాలు ఎదురుకుంటున్నారు ..
ఇదిలా ఉంటె లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జులై 22కు వాయిదా వేసింది. వాయిదా వేస్తున్న విషయాన్ని ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించారు.
దీనిపై స్పందించారు కవిత తరఫు న్యాయవాది. విచారణ సమయంలో సీబీఐ ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు సీబీఐ తరఫు న్యాయవాది. ఛార్జిషీట్లో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.