కేసీఆర్ .. ఒక ఉద్యమకారు అలాగే… పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి చాలా ఫేమస్ అయ్యారు. కేసీఆర్ రాజకీయాల్లో దిట్ట అని చెప్పాలి .. అధికారంలో ఉన్నపుడూ కేసీఆర్ మాట్లాడిందే వేదం అన్నట్లు పార్టీ లో పరిస్థితి ఉండేది ..
కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అర్ధం కావు… వ్యూహాలు పన్నడంలో కూడా కేసీఆర్ కి ఎవరు సరిలేరు .. అలాంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు… సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెసిఆర్ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే… యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది.
తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా కేసీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో కెసిఆర్ చెప్పే డైలాగ్స్ ను చాలామంది సోషల్ మీడియాలో వాడుతూ ఉంటారు… ప్రెస్ మీట్ లో కేసీఆర్ భలే తమాషాగా మాట్లాడుతూ … మీడియా కు తెలివిగా సమాధానాలిస్తూ ఉంటారు.. ఆయన వాడే ఊత పదాలకు కూడా… ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్నాయి. అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు … అయితే కెసిఆర్ డైలాగులను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు వినియోగించుకుంటుంది. ఆయనను పాపులర్ చేసేలాఇండస్ట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది… దీనితో టాలీవుడ్ లో కేసీఆర్ హావ కనిపిస్తుంది లేనట్లే ఉంది ..
అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ సినిమాలో కల్వకుంట చంద్రశేఖర రావు డైలాగ్ ను వాడుకున్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని… డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండవ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. మార్ ముంత అంటూ సాగే ఈ పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా పాట సోషల్ మీడియాలో వైరల్ గా
మారడం జరిగింది…కేసీఆర్ వల్లే ఈ పాటకు ఇంత హైప్ వచ్చిందని టాక్ … చూడాలి మరి సినిమా వచ్చి సాంగ్ థియేటర్లు ను షేక్ చేస్తుందో లేదో ..
అయితే ఈ పాటలో కేసీఆర్ వాయిస్ కూడా ఉంది. ఆయన ప్రెస్ మీట్ లో చెప్పే ఏం చేద్దాం అంటావు మరి అని వాడిన డైలాగ్ ను… ఈ సినిమా పాటలో పెట్టారు. దీంతో ఈ పాట మరింత వైరల్ గా మారడం జరిగింది. ఇక ఈ పాటలో కేసీఆర్ వాయిస్ ఉండటంతో గులాబీ నేతలు కూడా… తెగ వైరల్ చేస్తున్నారు.