టాలీవుడ్ లో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా డబుల్ స్మార్ట్ సినిమాపై పడుతోంది…పూరీ జగన్నాథ రామ్ పోతినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ రెండవ సినిమా మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వల్ గా రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మేకింగ్ కోసం దర్శకుడు పూరి చాలా టైం కూడా తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకోవాలి అనే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు.
ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను అన్ని భాషల్లో భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక హిందీలో కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.. లైగర్ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ హిందీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం అసలు తగ్గకుండా ప్రమోషన్స్ చేయడానికి పూరీ టీం సిద్ధమయ్యింది.. ముఖ్యంగా ఒక భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈవెంట్ కు సినిమాలో నటించిన అందరూ నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు.
ఇక ముంబైలో జరిగే స్పెషల్ ఈవెంట్ విషయంలో మాత్రం మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సంజయ్ దత్ కూడా ఆ వేడుకలో పాల్గొనబోతున్నారు. కాబట్టి తప్పకుండా బాలీవుడ్ ఫోకస్ ఈ సినిమాపై పడుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన మరొక సాంగ్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మార్ ముంతా చోడ్ చింత అనే మాస్ హై వోల్టేజ్ సాంగ్ వైరల్ అవుతోంది… అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది … ఈ సాంగ్ లో కేసీఆర్ మాటలు పెట్టాలని …
వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ..
అయితే తెలంగాణ సాధకుడు, రెండు దఫాలుగా సీఎంగా ఉన్నతమైన పదవిలో కొనసాగిన కేసీఆర్ లాంటి నాయకుడి మాటను ఇలా కల్లు పాటలో పెట్టడం, ఓ ఐటమ్ లేడీ డ్యాన్స్ చేస్తున్న పాటకు ఉపయోగించడంపై గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్నారు.
తెలంగాణ నాయకుడు పేరును దెబ్బతీయడానికే ఆ మాటను ఉద్దేశ పూర్వకంగానే పాటలో ఇరికించారని ఆరోపిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మార్ ముంత ..చోర్ చింత సాంగ్ లోంచి కేసీఆర్ మాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. డైలాగ్ పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటె అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ప్రతి సాంగ్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ కూడా వైరల్ అయ్యే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలో దర్శకుడు పూరి మేకింగ్ విధానం సరికొత్తగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా కూడా డబుల్ ఇస్మార్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.