Andhra Pradesh latest news : టెక్కలిలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఇంటి వద్ద చేపట్టిన నిరసన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది.
ఇంట్లోకి రానివ్వడం లేదని వాణి, పెద్ద కూతురు హైందవి బయట కార్ షెడ్లో దీక్ష కొనసాగిస్తున్నారు. వైకాపా కార్యకర్త దివ్వల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వాణి ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఇరు కుటుంబాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్, వాణిలు ఒకరిపై ఒకరు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.