గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది..దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పులను ఒక్కొక్కటి బయటపెడుతోంది ..
ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేసి ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్న వైసీపీ ని వదిలపెట్టకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.. భారీగా నిధులు బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగినప్పుడు ఆ భూముల యజమానులు స్థానికంగా అందుబాటులో లేకుంటే ఆ భూములను ఆర్ఎస్ఆర్ లో నమోదు చేసే సమయంలో హక్కుదారుల పేర్లకు బదులుగా చుక్కలు అంటే డాట్స్ పెట్టారు.. యజమానులు గుర్తింపు లేని భూములకు ప్రభుత్వం దరఖాస్తు పట్టాలు ఇవ్వగా కొన్ని భూముల్లో చాలా మంది ఏళ్ల నుంచి కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు…
ఇలా చుక్కల భూములు కొందరి అధీనంలో ఉన్నాయి. అయితే 2008 నుంచి అలాంటి చుక్కల భూములను రిజిస్టర్ చెయ్యడానికి ప్రభుత్వం నిరాకరించింది. తరువాత ఆయా ప్రాంతాల్లోని చుక్కల భూముల వివరాలను స్థానిక తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయాలకు పంపించడంతో ఆ భూములను 22 ఏలో చేర్చారు.ఇలాంటి భూములు ఆధీనంలో పెట్టుకున్న రైతులు ఆ భూములను అమ్ముకోలేక, పిల్లల చదువులు, వారి సొంత అవసరాలు తీర్చుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు చుక్కల భూముల మీద కన్నువేశారు… జగన్ దానిపై దందా చేసినట్లు ప్రజలు వాపోతున్నారు .. కాగా రెవెన్యూ యంత్రాగాన్ని గుప్పట్లో పెట్టుకున్న వైసీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా చుక్కల భూమలను నిషేధిత 22ఏ నుంచి తొలగించారు.. చుక్కల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ మొత్తం సర్వే చేసిన వైసీపీ నాయకులు ఆ జాబితాను చేతిలో పెట్టుకని వారి గాడ్ ఫాదర్ల దగ్గరకు వెళ్లారు.
వైసీపీ నాయకులు ఆదేశాలకు సలామ్ చేసిన రెవెన్యూ శాఖ అధికారులు చుక్కల భూములను నిబంధనలకు విరుద్దంగా వాటిని వైసీపీ నాయకుల పేర్లతో రిజిస్టర్ చేయించారని తెలిసింది. ఇలాంటి గోల్ మాల్ వ్యవహారాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా జరిగాయని చంద్రబాబు ప్రభుత్వం పసిగట్టింది. చంద్రబాబు సీఎం అయిన తరువాత చుక్కల భూముల గోల్ మాల్ వ్యవహారంపై ఎక్కువ శ్రద్ద చూపించడంతో వైసీపీ నాయకులు హడలిపోయారు. ఇలాంటి చుక్కల భూములు గోల్ మాల్ జరిగిన మండలాల రికార్డులను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తోంది… మొత్తానికి చంద్రబాబు వేటు చుక్కల భూముల మీద పెట్టారు .. వైసీపీ పని అవుట్ … జగన్ ఇంకా ప్రజల్లో కూడా లేకుండా పోతారు అనేలా పరిస్థితులు ఉన్నాయి ..