ఏపీ లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి … ఏపీ రివేంజ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. చేతిలో అధికారం ఉందికదా అని రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడ్డ నేతలకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు చంద్రబాబు మరో వైపు ప్రజలు దండెత్తుతుండడంతో.. వైసీపీ నేతలకు ఊపిరి ఆడడం లేదు. .
మరోవైపు పవన్ కళ్యాణ్ అభివృద్ధి దిశగా పాటు పడుతున్నారు …
అలాగే సీఎం చంద్రబాబు పోలవరం … రాజధానుల పై కసరత్తులు స్టార్ట్ చేసారు … అలాగే మహిళలకు ఫ్రీ బస్సు … ప్రతి ఇంట్లో ఆడపిల్లకు 1500 రూపాయలు కూడా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు ..
ముఖ్యంగా సీఎం బాబు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్ధానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తోంది. .. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై ప్రతీ నెలా ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్ధానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు… అంతే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చిచెప్పేసారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు… పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు.మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు. ఇదంత చుస్తే చంద్రబాబు ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది ..
ఇదే జాగితే ప్రజలు చంద్రబాబు ను నమ్మితే … వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి ఖాయమని నేతలు భావిస్తున్నారు … అందుకే ఏపీ లో
అన్యాయం జరిగిన జగన్ దానిపై స్పందించి వెంటనే అధికార ప్రభుత్వంపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు ..