కాంగ్రెస్ లో ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా
తన గొంతుకగా వినిపించిన రేవంత్ రెడ్డి .. రాజకీయాల్లో ఆరితేరాలు అనే చెప్పాలి .. ప్రత్యర్దులకు చుక్కలు చూపించారు .. ముఖ్యంగా కేసీఆర్ , కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి … బిఆర్ ఎస్ నేతలకు హడల్ పుట్టేలా చేసారు … అలా మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం గా వ్యవహరిస్తూ … డిఎస్సి , గ్రూప్ 2 జాబ్స్ పై నోటిఫికెషన్స్ విడుదలచేశారు .. అయితే ఇదిలా ఉండగా త్వరలో
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి చాలా వ్యూహాలను పన్నుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పక్క ప్లాన్ ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ వ్యూహంలో సక్సెస్ అవుతున్నారు.
ఆయన వల్ల ఇప్పటికే 9 మందికి పైగా BRS ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు, మరికొంత మంది త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది… బిఆర్య్స్ పార్టీ ను మట్టికలుపుతానని శపధం చేసిన రేవంత్ అదే కోవాలో వెళ్తున్నారు … ముఖ్యంగా విపక్షాల నుంచి ఎక్కువ మంది సభ్యులను కాంగ్రెస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్ ఇంతకుముందు ప్లాన్ చేశారు ఇప్పుడు అదే ప్లాన్ రివర్స్ అయ్యింది. రేవంత్ రెడ్డి కెసిఆర్ ఎంతమందిని లాక్కున్నారో వారందరినీ తిరిగి మళ్ళీ లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం తమ పార్టీలో విలీనం చేస్తున్నారు. చేరిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొన్నిచోట్ల బలంగా ఉండగా, మరికొన్ని చోట్ల తృటిలో వారు ఓడిపోవడం జరిగింది.
చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్ కేవలం 282 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో ఓడిపోయారు. ఆ నియోజక వర్గంలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భరత్, అతని మద్దతుదారులు యాదయ్య కాంగ్రెస్లో చేరడంపై అసంతృప్తిని బాగా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకుండా నేరుగా వారితో మాట్లాడి రాబోయే ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు… అసంతృప్తి గా ఉన్న వాళ్ళను సీఎం కలిసి మాట్లాడి సర్దుమణిగేలా చూస్తున్నారు … కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పార్టీలో కీలక పదవులు ఇస్తామని ఆయన భరోసా ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.