ఏపీ లో సరికొత్త రాజకీయాలు మొదలయ్యవి … వైసీపీ ఓటమి … టీడీపీ గెలుపు తరువాత … రాష్ట్రంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి …
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఫోకస్ చేసారు .. అదే తరుణంలో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో అభివృద్ధికి పూనుకున్నారు … బాబు , పవన్ తమ పనుల్లో భాగంగా దుకుకెళ్తుంటే ..
అనుకోకుండా నంద్యాల లో ఒక దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై హైస్కూలు విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన సంగతి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది … ఆ బాలికను అత్యాచారం చేసి తరువాత బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది.
అసలు విషయానికొస్తే ..!
నంద్యాల జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. బాలిక అదృశ్యంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులకు బాలిక మృతదేహం లభించింది. దీంతో బాలిక స్కూల్ చదివే విద్యార్థులను ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది.
బాలికపై తాము అత్యాచారం చేశామని ఆ ముగ్గురు బాలురు తెలిపారు. ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పారు. అయితే బాలిక మృతదేహంపై ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంపై పోలీసులు తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి…
ఈ విషయం తెల్సిన కొందరు సెలెబ్రెటీస్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు .. బాలిక రేప్‌పై స్పందించిన సింగర్ చిన్మయి..స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సిన డిమాండ్ చేసింది … లేదా పిల్లలు కూడా కృరమృగాల్లా మారతారని సోషల్ మీడియా వేదికగా స్పందించింది .. ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని చిన్మయి సూచించారు. అయితే ఈ ఘటనపై యాంకర్ రష్మీ కూడా స్పందించారు. వాళ్లు పెద్దవాళ్ల లాగా రేప్ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె ట్యాగ్ చేశారు. సెలబ్రిటీలు సైతం ఈ ఘటనపై స్పందిస్తుండటంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగినట్టు అయింది.