రోజా సెల్వమణి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ..ప్రత్యర్థులకు చుక్కలు చుపించే వాళ్ళు … నోరు వేసుకొని అరిచే రోజు .. ప్రస్తుతం సైలెంట్ గా అయింది … జగన్ ఓటమితో రాజకీయాల్లో కొన్ని మార్పులు వచ్చాయి … వైసీపీ నేతలు మనకెందుకులే అన్నట్లు మౌనం గా ఉన్నారు … అయితే రోజా సినీ కెరియర్ అందరికి తెలిసిందే.. పెద్ద హీరోస్ తో సైతం స్టెప్పులేసింది .. అయితే కొన్ని టీవీ షోస్ లు కూడా రోజా చేసింది. కానీ రోజా తర్వాత పాలిటిక్స్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. మరి ఆమెకి సినిమా ఫేమ్ ఉన్నప్పటికీ ఈ రంగంలో మాత్రం వెంటనే విజయం రాలేదు… కానీ ఎట్టకేలకి 2019లో తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాక మాత్రం.. రోజాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే…
ఇదే నేపథ్యంలో
ప్రముఖ హీరోస్ విషయంలో కూడా రోజా చేసిన పలు అనుచిత వ్యాఖ్యలతో రోజాపై మరింత నెగిటివ్ రావడం జరిగింది.అదే తరుణంలో పవన్ కళ్యాణ్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది .. తన మూడు పెళ్లిళ్లపై కూడా రెచ్చిపోయింది .. దానికి కౌంటర్లు పవన్ ఫాన్స్ ఇస్తూనే ఉంటారు.. అయినా దురుసు తగ్గలేదు జగన్ ను చూసుకొని రేచిపోయేది .. ఆ సమయంలోనే రోజా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలా మాట్లాడుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే తన పరిస్థితి ఇలా ఉంటుంది అని కూడా కొందరు ముందే ఊహించారు… అనుకున్నట్టుగానే ఇప్పుడు ఓటమి పాలయ్యాక రోజా పరిస్థితి దారుణంగా ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజాకి అయితే తెలుగులో ఎలాంటి అవకాశాలు దొరకడం లేదట, ఒక్క సినిమాల్లోనే కాకుంగా కనీసం బుల్లితెర మీద అయినా ఏమన్నా చేద్దామన్నా తెలుగులో ఆమెకి ఎలాంటి అవకాశాలు రావట్లేదు అని వినిపిస్తుంది… ఒక్క టెలివిజన్ షో అయినా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందట. అయినా అక్కడ నుంచి కూడా సరైన రెస్పాన్స్ ఆమెకి లేనట్టే అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి అయితే రోజా తన కెరీర్ ని తన చేజేతులా వెనక్కి లాక్కుందని చెప్పాలి. మరి మళ్ళీ రోజా కోరుకున్న ఫేమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో దొరుకుతుందో లేదో కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది.. ఇలా మొత్తంగా ఎటు చూసినా కూడా రోజా పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉందని సినీ వర్గాల్లో టాక్.