ఏపీ లో కొత్త రాజకీయాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి ..
పగలు .. ప్రతీకారాలతో ఉడికిపోతుంది .. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ
సైలెంట్ అయింది … అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలపై రెచ్చిపోయి .. ఇష్టమొచ్చినట్లు వాగారు …అదే తరుణంలో చంద్రబాబు … పవన్ కళ్యాణ్ పర్సొనల్ విమర్శలు చేసారు …అయినా టీడీపీ మౌనం గా ఉంది … ప్రజలు చంద్రబాబు ని నమ్మి పట్టంగట్టారు … జగన్ ప్రజల చేతిలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు .. కాగా
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కలిశారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్ కు.. అసెంబ్లీలోకి వెళ్లగానే రఘురామ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి.. పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్ధిహి ఉన్న ఇద్దరు మాట్లాడుకోవడంతో .. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కళ్లన్నీ వారిపైనే పడ్డాయి . అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ కి .. పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కనిపించారు. అంతే వెంటనే రఘురామ ఆయన్ను పలకరించారు. అంతే కాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు ..అయితే రఘురామ కృష్ణంరాజు జగన్ చెవిలో ఎదో చెప్పడం కనిపించింది. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది. దీంతో ప్రస్తుతం అందరి మధ్య ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. 2019 లో వైసీపీ లో ఎంపీగా రఘురామ కృష్ణరాజు గెలిచారు. తరువాత జగన్ తో విబేధించి జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇది వివాదంగా మారింది..
రఘురామ కృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసింది. అరెస్టు చేసిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. చంపేందుకు కూడా చూశారని అప్పట్లో రఘురామ కృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రఘురామా టీడీపీలో చేరారు .. 2024 ఎన్నికల్లో రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన జగన్మోహన్ రెడ్డి, సీఐడీ అధికారులు తనపై అప్పట్లో హత్యాయత్నం చేశారని గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో జగన్.. రఘురామల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇలాంటి నేపథ్యంలోఅసెంబ్లీలో రఘురామ-జగన్ మధ్య జరిగిన ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఏకంగా జగన్ దగ్గరకు వెళ్లిమరీ.. రఘురామ ఆయన చెవిలో వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విబేధాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత వేడిని రాజేసిందని చెప్పవచ్చు… టీడీపీ లో ఉండి జగన్ తో అంత క్లోజ్ గా ఉండడంపై అందరి కన్ను వాళ్ళ మీదనే ఉన్నది ..
జగన్ తో రఘురామా ఎందుకలా ఉన్నారు … అనేది ప్రశ్నగానే మిగిలింది