ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది .. అయితే ఆ లోపే పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ..ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం ఇచ్చింది … అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నంబరు గేటు బయటనే దిగి లోపలికి వెళ్లాలని నిబంధనలు ఉన్నాయి.. అయితే ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది . వైఎస్సార్సీపీ శాసన సభపక్ష విన్నపం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోను ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో జగన్‌కు కొంత మినహాయింపు ఇచ్చారు …మరోవైపు జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.
జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. నల్ల కండవాలు ప్ల కార్డ్స్‌తో అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది… జగన్ ఎన్నడూ లేని విధంగా
పోలీసులపై భగ్గుమన్నారు …
పోలీసుల తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారు…వార్నింగ్ కూడా ఇచ్చారు … పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని.. పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు’అంటూ సీరియస్ అయ్యారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమానీ.. యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. .ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చించివేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ తర్వాత జగన్ ఎమ్మెల్యలతో కలిసి సభ లోపలికి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ శ్రీ ఎస్.అబ్ధుల్ నజీర్ ప్రసంగం చేసిన తర్వాత సభ వాయిదా పడింది .