మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే… ఎన్నికల ఫలితాల తరువాత జగన్ బాగా హర్ట్ అయ్యారని .. అసెంబ్లీ లో మొహం చూపించలేక దానికి హాజరు కాలేదని టాక్ .. అయితే జగన్ అధిరంలో ఉన్నప్పుడు అధికార మదం తో రెచ్చిపోయారు .. ఆ పార్టీ నేతలు కూడా పచ్చి భూతులతో మీడియా ముందు ప్రత్యర్థులను ఆడిపోసుకున్నారు .. ఈ తరుణంలో ఓడిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికి మూడుసార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం.. తిరిగి తాడేపల్లికి చేరుకోవడం తెలిసిందే… ఇదే జరుగుతుంది .. అసలెందుకు బెంగళూరు పర్యటన చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది … అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగుళూరు పర్యటన పెట్టుకోవడం గమనార్హం.
అతి కూడా సతీ సమేతంగా అక్కడ ఉండటం తన బంధువులతో కలిసి చర్చలు జరపడం వంటివి చేస్తున్నారు. అయితే దీని వెనుక అసలు రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చర్చిగా మారింది… బెంగళూరు నుండి ఏమి రాజకీయాలు జగన్ చేస్తున్నారా అని అందరు అటువైపు చూస్తున్నారు .. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య రెండున్నర సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు ఎక్కువ కాలం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోనే ఉన్నారు. 2014 నుంచి 2017 వరకు కూడా ఆయన హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టినా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం తిరిగి వెళ్ళిపోవడం చేశారు… హైదరాబాద్ లోటస్పాండ్ లోనే నివాసం ఉండడం వంటివి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు హైదరాబాద్ మొహం కూడా ఆయన చూడట్లేదు. లోటస్పాండ్ లో అసలు అడిగే పెట్టట్లేదు. దీనికి కారణం షర్మిలేనని అంటున్నారు. ఎందుకంటే లోటస్ పాండ్ లోని ఒకవైపు షర్మిల ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తనకు ఇచ్చేయాలని షర్మిల కొన్నాళ్లుగా రాయబారం చేయిస్తున్నారని, దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదని పార్టీ వర్గాల్లోని కీలకమైన నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
లోటస్ పాండ్ నిర్మాణం వైయస్ హయాంలో జరిగింది. దీనిని పంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో షర్మిల బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడే మకాం వేసి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే షర్మిల లోటస్పాండ్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. దీంతో ఆ ఇంట్లోనే విజయలక్ష్మి కూడా ఉంటున్నారు… ఈ నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు ఈ కారణంగానే బెంగళూరుకు వెళ్తున్నారని లోటస్పాండ్ కి వెళ్లడం ఇష్టం లేకే ఆయన బెంగుళూరు ఇంట్లో ఉంటున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. .. ఇద్దరికీ పాడడం లేదు కాబట్టే అక్కడ ఉండడం లేదని .. లోటస్ పాండ్ లో ఉంటె షర్మిల మొహం చూడాల్సి వస్తుందని .. జగన్ వర్గాలు చెప్తున్నాయి .. చూడాలి మొత్తానికి ఏమి జరుగుతుందో .. అటు చెల్లి .. ఇటు రాజకీయాలు .. జగన్ బెంగళూరు స్టోరీ ఏంటో తెలియాల్సి ఉంది ..