శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో బోలెడు సినిమాలు చేసింది కానీ నెంబర్ వన్ లిస్ట్ లో చేరలేకపోయింది … ఏదో సినిమాలు చేస్తూ బిజీ గా లేకపోయినా తల్లి అంత ఆదరణ రాలేదు ..శ్రీదేవికి ఉన్న క్రేజ్ .. పేరు జాన్వీ కపూర్ కి దక్కలేదు అనే చెప్పాలి ..
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ చేయడంతో పాటు సల్మాన్, షారుఖ్ లాంటి సీనియర్ల సరసన గువ్వపిల్లలా కనిపించడం లాంటి కారణాలు తనకు పెద్ద అవకాశాలు రాకుండా చేస్తున్నాయి. అయితేనేం టాలీవుడ్ లో మాత్రం గ్రాండ్ ఎంట్రీ దొరుకుతోంది. ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఆల్రెడీ రెండు క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మూడో దానికి రంగం సిద్ధమవుతోందని ఫిలిం నగర్ టాక్. దసరా తర్వాత తమ కాంబోని మరోసారి రిపీట్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ ప్యాన్ ఇండియా మూవీకి జానీ కపూర్ అయితే బాగుంటుందని భావించి ఆ మేరకు సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రతిపాదన అయితే వెళ్లిందట. జాన్వీ ప్రస్తుతం దేవర 1 బాలన్స్ షూటింగ్ తో పాటు ఇతర బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ 16 కోసం ఇంకా డేట్లు ఇవ్వలేదు. సెప్టెంబర్ షెడ్యూల్ ఖరారయ్యాక కాల్ షీట్స్ లాకవుతాయి.