Andhra Pradesh latest news : మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఏ1గా ఉన్నారు. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావులను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీలకు సంబంధించి జోగి ఇంట్లో ఇప్పటికే ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్‌కు తాడేపల్లి పోలీసులు ఆదివారం నోటీసు ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఈరోజు సాయంత్రం విచారణకు హాజరవుతానని చెప్పారు.