Home » టాటా మోటార్స్ వారి పంచ్ ఈవీ

టాటా మోటార్స్ వారి పంచ్ ఈవీ

by malakapalli
0 comment
TATA - Punch EV Gold Andhra

భారత్ N-CAP భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం రేటింగ్ లో టాటా మోటార్స్ వారి పంచ్ ఈవీ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ఇప్పటికే టాటా సఫారీ, టాటా హరియర్ N-CAP లో చోటు దక్కించుకున్నాయి. వాటి తర్వాత టాటా పంచ్ ఈవి చేరడంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది.

పంచ్ ఈవి భద్రతకు సంబంధించిన అంశాల్లో అత్యధికంగా 29.86 పాయింట్లు, పిల్లల భద్రతకు సంబంధించి 44.54 పాయింట్లు సాధించింది. గతంలో కార్లను క్రష్ టెస్ట్ చేసి వాటి సేఫ్టీ ఫీచర్లు ఆధారంగా రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ N-CAP ను తీసుకొచ్చింది. తప్పనిసరి నిబంధనలతో పాటు అధునాత న రహదారి భద్రత, వాహనం భద్రత ప్రమాణాలు అనుగుణంగా N-CAP నడుచుకుంటుంది.

N-CAP రేటింగ్ లో టాటా మోటార్స్ వారి మరో వాహనం చేరడంపై మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆయన ట్విట్టర్ వేదికగా టాటా వారికి అభినందనలు తెలిపారు. వినియోగదారులు సురక్షితమైన వాహనాన్ని ఎంచుకునేందుకు భారత్ N-CAP రేటింగ్ సహాయపడుతుందని ఆయన తెలిపారు

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved