ఏపీ లో బారి విజయం తరువాత చంద్రబాబు … ఏపీ ను ఈ 5 ఏళ్ళలో
నెంబర్ 1 ప్లేస్ లో ఉంచాలని అదే దిశగా అడుగులువేస్తున్నారు ..
అదే పనిలో పనిగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసారు … దినిలో భాగంగా తెలంగాణ లో మళ్లీ స్ట్రాంగ్ అయ్యేందుకు టీ.టీడీపీ స్పీడ్ పెంచింది.. పూర్వవైభవం కోసం వ్యూహాలను పెదలు పెట్టింది. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో ఇక్కడ కూడా చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీని నడిపించే నాయకుడు లేకపోవటంతో పాటు, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకపోవటంతో ఆ పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు మద్దతుగా నిలిచారు.
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యనేతలుగా చలామణిలో ఉన్న ఇద్దరు నేతలు త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు చంద్రబాబుతో మంతనాలు జరిపారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చాలా మంది నేతలు తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవారే. వారిలో కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలపై ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ముఖ్యనేతలు అధికశాతం మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్టపడని నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసి , ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం గూటికి చేరడం ఇక లాంఛనమే అని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తరఫున మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మల్లారెడ్డి ఒరింత ఇబ్బందిరన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో మల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య భూకబ్జాల విషయంలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.
మల్లారెడ్డి వందల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ సీఎం అయిన తర్వాత మల్లారెడ్డి కళాశాలకు చెందిన భవనం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మాణం చేశారంటూ కూల్చివేశారు. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే దాడిని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు సిద్ధపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ టైం లో మల్లారెడ్డి కాంగ్రెస్ చేరినట్లే అని అందరూ అనుకున్నారు … కాకపోతే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ లో కొందరు వ్యతిరేకించడంతో ఆయన కాంగ్రెస్లో చేరిక నిలిచిపోయింది. ప్రస్తుతం ఎదురయ్యే ఇబ్బందిని తట్టుకోవాలంటే టీడీపీ లో చేరడమే మంచిదన్న భావనకు మల్లారెడ్డి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ కీలకంగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అండదండలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి పెద్దగా ఇబ్బంది ఉండదని మల్లారెడ్డి, ఆయన వర్గీయులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ చేరి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.