ఏపీ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ కూటమి ప్రభుతం అడుగులు ఆఫ్ డెవలప్మెంట్ వైపు ముందుకు వెళ్తున్నారు .. ఈ తరుణంలో గత ప్రభుత్వం ఈసారి కూడా గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో కలలు కన్న వైసిపి నాయకుల ఆశలు అన్ని అడియాసలు అయిపోయాయి..వైసీపీ గెలుపు ధీమాతో ఉండగా ప్రజలు షాక్ ఇచ్చారనే చెప్పాలి జగన్ కి .. ఓడిపోవడం సంగతి అలా ఉంచితే పార్టీ చిత్తుచిత్తుగా ఘోరంగా ఓడిపోయింది.. వైసీపీ లీడర్స్ మొహం కూడా చూపించుకోలేక .. పారిపోతున్నారు అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు .. వై నాట్ 175 అని కోతలు కోసిన వైసీపీ .. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి..
అయితే వైసిపి నుంచి గెలిచిన ఈ 11 మంది ఎమ్మెల్యేలు … నలుగురు ఎంపీలలో కొందరు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన 11మంది ఎమ్మెల్యేలలో తొలిసారి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎంతో కష్టపడి ఎమ్మెల్యేలుగా గెలిచారు .. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి వైసిపి కోసం పోరాటాలు చేసినా ఉపయోగం ఉండదు ..తర్వాత ఐదు సంవత్సరాలకు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ? చెప్పలేం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూడా గుర్తించే అవకాశం లేదు .. కనీసం నియోజకవర్గాలలో కూడా తమ మాట ఎలాగో నెగ్గే పరిస్థితి లేదు … ఇన్ని ఇబ్బందులు పడుతూ వైసిపి ఎమ్మెల్యేలుగా ఉండటం కంటే టీడీపీ పార్టీలో చేరి కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగితే చాలావరకు పనులు చక్కబెట్టుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వాళ్ల పై నిఘా పెట్టినా కూడా వారు పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని తేలడంతో జగన్ వారి విషయం లో ఏం చేయాలో తెలియ క సతమత మవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది .. మొత్తానికి ఉన్న వాళ్ళు కూడా బై చెప్పి వెళ్లే ఆలోచనలో ఉన్నారు .. ఇంకేముంది జగన్ పరిస్థితి ఏంటో పాపం …
టీడీపీ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు..
0Keep Reading
Add A Comment
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.
© 2024 GoldAndhra | All Rights Reserved