అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాప్రయత్నం జరిగింది … అసలేంటి ఎవరు చేసారు .. దీని వెనుక ఎవరి కుట్ర ఉంది.. ఏంటో ఒకసారి స్టోరీ లోకి వెళ్దాం ..
అయితే పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు..ఈ దాడిలో ట్రంప్ కుడిచెవికి బుల్లెట్ తగిలి గాయమైంది.. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై ట్రంప్‌ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వేదిక పైనుంచి దిగేటప్పుడు ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
అయితే తనపై కాల్పుల విషయం డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు అని పోస్ట్ చేసారు .. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. చాలా రక్తస్రావం జరిగింది అని పోస్ట్ చేశారు.