తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ, గ్రూప్ -2పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ధర్నాలు చేస్తున్నారు .. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు .. అయినా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం లో క్లారిటీ ఇచ్చారు … ఏది ఏమైనా సరే వెనక్కి తగ్గేదెలా అని ససేమిరా ఉన్నారు .. దీనిపై నిరుద్యోగులు సీఎం పై గుర్రుగా ఉన్నారు … ముఖ్యంగా చాలామంది నిరుద్యోగులు అరెస్ట్ లు అవుతున్నారు. దీక్షలతో కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పుపై ఎలాంటి ప్రకటన చేయ్యడం లేదు.
ఇంత ఆందోళనలు జరుగుతున్నా బీజేపీ మాత్రం కామ్ గా ఉండడానికి కారణం అదే అని టాక్ వినిపిస్తుంది …
బీఆర్ఎస్ మాత్రం నిరుద్యోగులకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ వాయిస్ ఎక్కడ వినిపించడం లేదు. అయితే మొదటి నుంచి ఈ ఆందోళనలపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బీజేపీ మాత్రం ఎలాంటి వైఖరి ప్రకటించలేదు. పరీక్షలు వాయిదా వేయాలనో.. షెడ్యూల్ మేరకే పరీక్షలు నిర్వహించాలనో ఏదో ఒకటి తమ వైఖరిని ప్రకటించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీకి అవకాశం ఉన్నా అడ్వాంటేజ్ తీసుకోకపోవడం పట్ల చర్చ జరుగుతోంది. షెడ్యూల్ మేరకే పరీక్షలను నిర్వహిస్తామని.. వాయిదా వేసే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఈ ఆందోళనల వెనక ఎవరు ఉన్నారో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే, నిజంగా ఈ ఆందోళనలు పెయిడ్ అని భావిస్తోందో ఏమో కానీ, నిరుద్యోగుల ఇష్యూను బీజేపీ పెద్దగా అడ్రస్ చేయడం లేదు. అక్కడక్కడ ఆందోళనలు కొనసాగుతోన్నా బీజేపీ సంఘీభావం కూడా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టే..బీజేపీ కూడా ఇదే వైఖరితో ఉందా..? అనే చర్చ జరుగుతోంది.