ఏపీ లో టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకొని
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది… ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.. బాధ్యతలు చెప్పటినప్పటి నుండి
చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టారు… ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తులు మొదలు పెట్టారు … ఏపీ ను అభివృద్ధి చేస్తా అంటూ…పోలవరంప్రస్తుతం ఈ హామీల అమలుపై చంద్రబ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.దాంట్లో భాగంగానే డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు… మహిళలకు అన్ని విధాలా మా ప్రభుత్వం తోడుగా ఉంటుందని మాటించారు .. దానిలో భాగంగా అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఆఫర్ ఇచ్చారు బాబు …
అదేంటో చూద్దాం ..!
చంద్రబాబు హామీలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు… కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందించనున్నారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెప్పిల్న్చాలి ఉంటుంది … దీనికి సంబంధించి రూ. 250కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు…
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది… రుణం ఇవ్వడంతో పాటుగా 35శాతం వరకు రాయితీని కూడా ప్రకటించింది. అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే అందులో రూ.35వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తుంది. అలాగే ఒక్కో మహిళకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు.ప్రభుత్వం 35% రాయితీ వర్తించే.. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోగలిగే యూనిట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
అవే ..!
కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే బేకరీ, స్వీట్ షాప్, ఐస్క్రీమ్తేనె తయారీ.. అప్పడాల తయారీ, వెజిటబుల్ సోలార్ డ్రయ్యర్, భోజనం ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డెయిరీ, పౌల్ట్రీ,ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై ఈ నిర్ణయం తీసుకున్నారు…
ఈ నిర్ణయంతో మహిళలు సంతోషముగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది … ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు అని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .. చూడాలి మిగతా హామీల విషయంలో బాబు ఇలానే కీయాలకంగా స్పందించి … అభిరుద్ది దిశగా అడుగులే వేస్తారేమో …