ఏపీ లో కొత్త రాజకీయాలు అలుముకుంటున్నాయి .. టీడీపీ
అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు … అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నారు ..
ఎన్నీకల్లో ఇచ్చిన గారెంట్స్ పై ఫోకస్ చేసారు … అందులో పెన్షన్ 4 వేలు పెంచారు … పోలవరం … రాజధాని .. అలాగే ఫ్రీ బస్సు విషయం లో అమలు చేసే పనిలో ఉన్నారు …అలాగే నిరుద్యోగులకు జాబ్స్ ఇలా ఆన్నింటిపై కసరత్తులు చేస్తున్నారు … జగన్ అక్రమ పాలనాచూడలేక
ప్రజల్ని వైసీపీ కి సరైన బుద్ది చెప్పారు … అయితే వైసీపీ అక్రమాలకు చరమగీతం పాడాలని బాబు ప్లాన్స్ వేస్తున్నారు … దానిలో భాగంగా
తల్లికి వందనం పథకం. ఇదివరకు వైసీపీ హయాంలో ఇదే పథకాన్ని అమ్మఒడి పథకం అని పిలిచేవాళ్లు. ఆ పథకం కింద ఏటా మనీ ఇచ్చినా, చివరి సంవత్సరం ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. ఐతే.. కొత్త కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద ప్రతీ స్కూల్ విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామంది మాట ఇచ్చింది .. ఇలా ఇంటర్ వరకూ ఇస్తామని చెప్పింది. అందువల్ల త్వరలోనే ఈ మనీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం కొన్ని పధకాల విషయంలో సైలెంట్ గా వ్యవహరిస్తోంది .. దానిలో భాగంగా కొన్ని పథకాలు ఎగ్గొడుతూ ఉంటాయి. తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. ఈ పథకం అమలవుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అందుకోసం ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలై మనీ రాగానే, ఫీజు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని అమలు చెయ్యాల్సిందే. .. తల్లికి వందనం పథకాన్ని అమలు చెయ్యకపోతే, ప్రజలు తీవ్రంగా తిరగబడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బాగానే అమలుచేసినా, ఇంట్లో ఒక విద్యార్థికే మనీ ఇచ్చింది. అదే సమస్య అయ్యింది. కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే, అంతమందికీ ఇస్తామని హామీ ఇచ్చింది ….
పథకానికి కావాల్సిన పత్రాలు:
ఇటీవల ఈ పథకంపై ప్రభుత్వంలో చర్చ జరిగింది. త్వరలోనే దీనికి మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అర్హతలు, కావాల్సిన పత్రాలు అన్ని వివరాలూ తెలుస్తాయి. ఐతే.. విద్యా సంవత్సరం మొదలై అప్పుడే 2 నెలలు అయిపోతోంది కాబట్టి.. త్వరగా పథకాన్ని అమలు చెయ్యాల్సిన అవసరం ఉంది. గైడ్లైన్స్ వస్తే, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫొటో, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ పాస్బుక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, అడ్రెస్ ప్రూఫ్ వంటివి అవసరం అయ్యే ఛాన్స్ ఉంది. వీటిని రెడీగా ఉంచుకుంటే మంచిదే.
ఈ పథకానికి ఇంకా అధికారిక అర్హతల లిస్ట్ రాలేదు. ఐతే.. అంచనా ప్రకారం.. తల్లి, బిడ్డ ఏపీ నివాసులు అయివుండాలి. తల్లికి ఆధార్ కార్డు ఉండాలి. పేదరిక రేఖ కు దిగువన ఉండేవారికే ఇది వర్తించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ ఉండితీరాలని కోరే ఛాన్స్ ఉంది.
ఏలా అప్లై చేసుకోవాలంటే ?
ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభించనుందని తెలిసింది. అది ప్రారంభమయ్యాక, అందులో apply here ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. ఓ కొత్త పేజీలో ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు నమోదుచెయ్యాలి. తల్లి, బిడ్డ పేర్లు, బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటివి అడుగుతారు. అవి ఇచ్చాక, వాటికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత Submit బటన్ క్లిక్ చెయ్యాలి. తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. దాన్ని సేవ్ చేసుకుంటే, ఆ తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి అది పనికొస్తుంది.