తెలంగాణలో రాజకీయాల్లో ఇంటర్నల్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.. రాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదని సమాచారం వినిపిస్తుంది .. ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జరుగుతోంది.. అలాగే బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీ నుంచి తెలంగాణలో మొత్తం 8 మంది ఎమ్మె ల్యేలు గెలిచారు. వారిలో అసెంబ్లీ కొందరే అడుగుపెట్టారు… ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరే అందులో సీనియర్లు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏయే అంశాలు ప్రస్తావించాలి? ఏయే హామీలపై రాష్ట్ర సర్కార్ను ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి… దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా తయారైంది. అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో పలు అంశాలపై సబ్జెక్ట్ అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి, ఏయే అంశాలను లేవనెత్తాలనే విషయాలపై చర్చ జరుగుతుంది ..వాటిపై సూచనలు కూడా ఇస్తారు… కానీ కాషాయ పార్టీలో పూర్తిగా ఆ పరిస్థితి లేకుండా పోయింది..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా.. బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు. తెలంగాణ కాషాయ పార్టీ లో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నా రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కమలం పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాషాయపార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంతర్గత వివాదాలను పార్టీ జాతీయ నాయకత్వం అయినా పట్టించుకుని సరిదిద్దుతుందా? లేదా? చూడాలి.