తెలంగాణకు బారి వర్ష సూచనా … వర్షం వస్తే ప్రజలు అల్లకల్లోలం అవుతారు .. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి..
ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం పడితే .. ట్రాఫిక్ .. నీటమునుగిన రోడ్లు … ఇవే కనిపిస్తాయి … రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తాయి …
ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. .. ప్రజలు అప్రమత్తంగా ఇళ్లల్లోనే ఉంటామని సూచనా చేసింది ..సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ తెలిపింది.
జులై 18 వరకు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న కొన్ని చోట్ల బారి వర్షం కురిచింది .. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. . అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది.