తొలిసారి పేపర్ లేస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రి టాబ్ లో చూసి బడ్జెట్ చదువుతారు. ఈ సారి బడ్జెట్ 9 అంశాలపై నిర్మించబడినట్లు ప్రకటించారు. రానున్న కాలంలో ఈ రంగాలను తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. అలాగే 4 కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విదంగా స్కిల్ చేసేందుకు 5 కొత్త స్కీమ్స్ కోసం రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.మెుదటగా వ్యవసాయంపై తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఉంచినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం దృష్టి సారించటంతో పాటు వాతావరణ ప్రతికూలతను తట్టుకునే వంగడాలను అభివృద్ధికి దోహదపడతామన్నారు. ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిపి రీసెర్చ్ ఫండింగ్ ఉంటుందన్నారు. 109 వాతావరణాన్ని తట్టుకునే హార్టీకల్చర్ వంగడాలను విడుదల చేస్తామని తెలిపారు. రానున్న కాలంలో కోటి మంది రైతులను న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించి వారికి సర్టిఫికేషన్ ఇస్తామన్నారు.ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నూనె గింజలు, పప్పు ధాన్యాలకు మిషన్ ద్వారా ఉత్పత్తి, స్టోరేజ్, మార్కెటింగ్ పెంచి దేశీయంగా అవసరాలను తీర్చేందుకు కృషిచేస్తామన్నారు. కూరగాయల సప్లై చైన్ బలోపేతం చేసేందుకు స్టార్టప్స్, రైతు సంఘాలను ప్రధాన వినియోగ కేంద్రాలకు భలోపేతం చేస్తామని చెప్పారు. స్టోరేజ్ అవకాశాలను కల్పిస్తామన్నారు. వ్యవసాయానికి డిజిటల్ ఇన్ ఫ్రాను తీసుకురానున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఫార్మల్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు సంబంధించిన పొలాలు ఇతర వివరాలను డిజిటలైజేషన్ చేస్తామన్నారు.
వ్యవసాయానికి ఈ ఏడాది 1.50 లక్షల కోట్ల రూపాయాలను మెుత్తంగా అందించారు.ఉపాధి లింక్ చేస్తూ మూడు స్కీమ్స్ మోదీ సర్కార్ ఈ సారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది. మెుదటి స్కీమ్ ఫస్ట్ టైమర్స్- దీని కింద అన్ని ఫార్మల్ సెక్టార్లలో అడుగుపెడుతున్న ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని అందిస్తుందన్నారు. మూడు విడతలుగా ఈపీఎఫ్ఓలో నమోదైన ఉద్యోగికి నేరుగా డబ్బు అందించబడుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే నెలకు లక్ష రూపాయలు వేతనం ఉద్యోగులు దీనికి అర్హులుగా చెబుతూ గరిష్ఠంగా 50,000 రూపాయాల కేంద్రం మూడు విడతలుగా అందిస్తుందని పేర్కొన్నారు.రెండవ స్కీమ్- మ్యానుఫ్యాక్చురింగ్ రంగంలో ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఆధారంగా మెుదటి సారి ఉద్యోగులతో పాటు యాజమాన్యానికి సైతం ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. 30 లక్షల మంది యువతకు ప్రయోజనాలు.కంపెనీలకు ప్రయోజనాలకు స్కీమ్ అదనపు ఉద్యోగాలను అందించే కంపెనీలకు రెండేళ్ల వరకు నెలకు 3000 వేల రూపాయాలు అందించనున్నారు. దీనికి వేతన పరిమితి లక్ష రూపాయాల వరకు ఉంచింది. 50 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీనిని తీసుకురాబడింది. దేశీయ కళాశాలల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు 10 లక్షల రూపాయాల రుణాన్ని అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.కేంద్రం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనేషన్ యాక్ట్ కింద క్యాపిటల్ అవసరాలకు 15,000 రూపాయాలు ఫైనాన్సియల్ సపోర్ట్ అందిస్తామని తెలిపారు. రానున్న సంవత్సరాల్లో దీనికోసం అదనపు నిధులను అందిస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయ ఆహార భద్రతకు ఇది కీలకంగా పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పవర్, వాటర్, రైల్వేలు, పోర్ట్స్ నిర్మాణానికి, అభివృద్ధికి నిధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలో కొత్తగా పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సహకరం కేంద్రం అందిస్తుందని నిర్మలమ్మ వెల్లడించారు.