తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ మారే షో కి లేదు అనే చెప్పాలి .. అంతటి ఆదరణ దక్కించుకున్నది .. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే షో .. చిన్నవారి దగ్గర నుండి పెద్దవారు వరకు అందరిని కట్టిపడేసింది ఈ షో.. అయితే ఇప్పటికే ఏడు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఎనిమిదివ సీజన్ రాబోతుండగా దీని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటూ చూస్తే బిగ్ బాస్ హడావుడి కూడా మొదలవుతుంది. 7 వ సీజన్ కన్నా ఈసారి కాస్త డిఫ్రెంట్ గా షో ఉండబోతుంది అని టాక్. బిగ్ బాస్ సీజన్-6 కు అనుకున్నంత రేటింగ్ రాలేదు. కానీ సీజన్ 7తో అది బ్యాలెన్స్ అయ్యింది.పల్లవి ప్రశాంత్ తో సీజన్ 7 ఎన్నాడు లేని హై టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సీజన్ 8 ను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వహకులు.. అయితే బిగ్ బాస్ హోస్ట్ పై గత కొద్దీ రోజులుగా సోషల్ మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అయింది …
దానిపై క్లారిటీ వచ్చేసింది .. బిగ్ బాస్ తెలుగుకి కింగ్ నాగార్జున కొనసాగుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నాని సెకండ్ సీజన్ హోస్ట్ చేశాడు. థర్డ్ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు… మంచిగా బిగ్ బాస్ నడిపిస్తూ … మన్మధుడు అనిపించుకుంటున్నారు …
ఐతే సీజన్ 7 కన్నా సీజన్ 8 కోసం నాగార్జున రెమ్యునరేషన్ భారీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది… సీజన్ 7 కి నాగార్జున 20 కోట్లు రెమ్యునరేషన్ గా అనుకోగా సీజన్ 8కి మత్రం మరో 10 కోట్లు ఎక్స్ ట్రా అంటే 30 కోట్ల దాకా డిమాండ్ చేశాడట. ముందు చెప్పినట్టుగా బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా చేసే అవకాశం ఉన్నది కేవలం నాగార్జుననే అని రెమ్యునరేషన్ ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారట. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఇప్పటికే ఐదు సీజన్లు హోస్ట్ చేశారు. మధ్యలో ఒక ఓటీటీ షోకి చేశారు. సో సీజన్ సీజన్ కి నాగార్జున కూడా హోస్ట్ గా తన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. సీనియర్ స్టార్ గా ఓ పక్క రెస్పెక్ట్ తో పాటు సీజన్ హైప్ కు నాగార్జున కూడా ఒక కారణం అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది.