ఏపీ లో భారీ విజయం తర్వాత టీడీపీ చేతికి పగ్గాలు వచ్చాయి .. జగన్ హయాంలో జరిగిన మోసాలను ప్రజలకు చెప్తూ … ఒకవైపు చంద్రబాబు జైలుకి వెళ్లారు అలాగే తండ్రి కోసం లోకేష్ పోరాడారు .. మరోవైపు పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు పెట్టుకొని తనదైన స్టైల్ లో ప్రజల చెంతకు వెళ్లి గళం విప్పారు .. ఇలా అన్ని కలిపి టీడీపీ విజయం సాదించాడనికి తోర్పడ్డాయి .. అయితే ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర పాలనలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవలే తెలంగాణలో కూడా పర్యటించారు. ఆ సందర్భంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని, పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నింపారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెబుతారు ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. త్వరలోనే మరోసారి రాష్ట్ర నేతలతో భేటీ అవుతానని చెప్పారు. ఇదే సమయంలో ఇక్కడ పార్టీని నేతలు వీడిపోయారు.. కానీ కార్యకర్తలు వీడలేదనే బలమైన నమ్మకంతో ఉన్న చంద్రబాబు.. పార్టీని పునరేకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో చాలామంది సీనియర్ ఎన్టీఆర్‌ను అభిమానించే వారు ఉన్నారు. పార్టీ యాక్టివ్‌గా లేకపోవడంతోనే వారిలో చాలామంది పక్క పార్టీల్లో చేరారు. వారిలో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపుడి గాంధీ ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ క్రేజ్‌ను మరోసారి గుర్తు చేసిందనే టాక్ వినిపిస్తున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా మిషన్ తెలంగాణకు చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్.రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. మరో మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పార్టీలోనే ఉన్నా స్థబ్దుగా ఉన్నాడు. ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు.
తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడి పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితులలో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి బాబు బెయిలు ప్రయత్నాలలో ఉండగా, అత్త నారా భువనేశ్వరికి వెన్నుదన్నుగా ఉండి ధైర్యం చెప్పడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలను విజయవంతంగా తెలిపిన విషయంలో బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలో లోకేష్, బాలక్రిష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది.