తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి .. లోక్ సభా ఎన్నికలు ముగియడంతో .. విస్తరణ ఉంటుందని అందరు ఆశగా అనుకున్నారు .. కానీ అది మాత్రం క్లారిటీ లేదు .. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు మాత్రం ప్రచారం జరుగుతుంది …ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ ..అధిష్టానం పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని అంటున్నారు .. దీనికి కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం … కాకపోతే మంత్రి వర్గం ఎవరిని వరిస్తుందో తెలియదు … కాగా మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి . మంత్రులు ఒకటి రెంటికి మించి చూస్తున్నారు. ఇది వారికి ఇబ్బందిగా మారింది. దీంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు .. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో త్వరగానే విస్తరణకు రెడీ సీఎం అవుతున్నారని తెలిసింది.
ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాలని రేవంత్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి .
అలాగే రైతు రుణమాఫి విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు … ఆగష్టు 15 ఇస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు ..
ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మాత్రమే కేబినెట్ లో ఉన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కలసి పనిచేసేందుకు కొన్ని ఖాళీలను కావాలని అలాగే ఉంచారు. అయితే ఆ వ్యూహం పని చేయలేదు ..మంత్రులు లేని చోట ఎవరు బాధ్యత తీసుకోక పార్టీ ఓటమి పాలయింది .. ఇక ఇప్పుడు మంత్రివర్గంపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరూ కాంగ్రెస్ నుంచి గెలవలేదు. కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.. అలాగే రంగారెడ్డి నుంచి మంత్రి లేరు .. నిజామాబాద్ బెర్ట్ కూడా ఖాళీగానే ఉంది .. ఇక ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం నుంచి నలుగురు మంత్రులుండగా, ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు … అయితే ఈసారి విస్తరణలో మైనారిటీలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. . దీంతో పాటు ముదిరాజ్ వర్గానికి చెందిన వారికి కూడా ఈసారి కేబెనెట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి… ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉండనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గాల నుంచి కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో రేవంత్ ఉన్నారు. ఎవరిని నొప్పించకుండా కేబినెట్ కూర్పు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎక్కువ అసంతృప్తులు చోటు చేసుకోకుండా, మంత్రి పదవి రాని వారికి తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామన్న హామీ కూడా గట్టిగా ఇవ్వాలన్న నిర్ణయంతో రేవంత్ ఉన్నట్లు తెలిసింది. అలాగే ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్త్‌లను భర్తీ చేసే చాన్స్ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. చేరేవాళ్ల స్థాయిని బట్టి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ సాగుతున్నది.
అయితే కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. కానీ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు అనేది క్లారిటీ ఇడా లేదు .. లోక్ సభా ఫలితాల నేపథ్యంలో రేవంత్ భయపడుతున్నారా .. ఎందుకు సీఎం వెనుకడుగు వేస్తున్నారని చర్చలు సాగుతున్నాయి . లోక్ సభా ఎన్నికల ఫలితాలతో బీజేపీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది .. దీనితో త్వరగా విస్తరణ చేపట్టి ..పాలనా పరిగెత్తించాల్సిన అవసరం ఉంది .. అయితే పదవులు దక్కని వారు అసంతృప్తికి గురవుతారు అని రేవంత్ సందేహంలో ఉన్నట్టు తెలుస్తుంది