ఒలింపిక్స్.. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా వేదిక. పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ..క్రీడా చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించేలా… ఫ్రాన్స్ సంస్కృతిని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా.. ఘనంగా ఆరంభమయ్యాయి. . కొన్ని వందల దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్ వస్తే చాలని ఎదురుచూస్తుంటారు.ఈ ఒలింపిక్స్ గతేడాది టోక్యోలో జరగ్గా.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చింది. అసలే పర్యాటకంగా పేరున్న అద్భుత నగరం ప్యారిస్. పైగా అతిపెద్ద క్రీడా సంబరం. ఇక చెప్పేదేముంది.అయితే
పారిస్ ఒలింపిక్స్ 2024 లో నిన్న జరిగిన హాకీ టీమ్ విజయం మినహా భారత్‌కు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి అని చెప్పాలి .. పతక ఆశలు రేకెత్తించిన బాక్సర్లు నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా నిరాశపరిచారు..దానితో పూర్తిగా అట మారిపోయింది ..
అటు చూస్తే క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. గోల్డ్ మెడల్ ఆశలు రేకెత్తించిన లక్ష్యసేన్ సెమీఫైనల్లో ఓడాడు.
అయితే ఈరోజు జరిగే కాంస్య పోరులో తన చివరి అవకాశాన్ని ఉపయోగించుకోనున్నాడు. భారత పురుషుల హాకీ టీమ్ మాత్రం గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
కాగా లక్ష్యసేన్ సెమీస్ పోరులో తలపడుతుండగా.. టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు టీమ్ ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్స్‌తో పాటు సెయిలర్స్, రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెజ్లింగ్‌లో నిషా దహియా మహిళల ఫ్రీ స్టైల్ 68 కేజీల కేటగిరీలో పోటీ పడనుండగా.. షూటర్స్ మిక్స్డ్ ఈవెంట్లో పోటీ పడనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ ఇదే!
షూటింగ్:
స్కీట్ మిక్స్డ్ టీమ్, క్వాలిఫికేషన్: అనంత్ జీత్ సింగ్ నరుకా-మహేశ్వరి చౌహన్- 12.30 గంటలకు
టేబుల్ టెన్నిస్ :
మహిళల టీమ్-రౌండ్ ఆఫ్ 16-భారత్ వర్సెస్ రోమానియా-మధ్యాహ్నం 1.30 గంటలకు
అథ్లెటిక్స్ :
మహిళల 400 మీటర్ల రౌండ్1- హీట్ 5- కిరణ పహల్- మధ్యాహ్నం 3.25 గంటలకు
పురుషుల 3000 మీట స్టీపుల్ ఛేజ్: రౌండ్-1 హీట్ 2-అవినాష్ సబ్లే- రాత్రి 10.34 గంటలకు
సెయిలింగ్:
మహిళల డింగీ రేస్ 9&10: నేత్ర కుమనాన్- మధ్యహ్నం 3.45 గంటలకు
పురుషుల డింగీ రేస్ 9&10: విష్ణు సరవణన్- సాయంత్రం 6.10 గంటలకు
బ్యాడ్మింటన్:
పురుషుల సింగిల్స్- కాంస్యపోరు- లక్ష్యసేన్ వర్సెస్ లీ జి జియా
షూటింగ్:
స్కీట్ మిక్స్డ్ టీమ్: కాంస్యపోరు(క్వాలిఫై అయితే) అనంత్ జీత్ సింగ్ నరుకా-మహేశ్వరి చౌహన్-సాయంత్రం 6.30 గంటలకు
రెజ్లింగ్ :
మహిళల 68 కేజీల ఫ్రీస్టైల్ 1/8 ఫైనల్స్-నిషా దహియా వర్సెస్ టీబీడీ- సాయంత్రం 6.30 గంటలకు..
మహిళల 68 కేజీల ఫ్రీస్టైల్ 1/4 ఫైనల్స్( క్వాలిఫై అయితే)-నిషా దహియా వర్సెస్ టీబీడీ- సాయంత్రం 7.50 గంటలకు..
ఇదండీ మొత్తానికి పారిస్ ఒలింపిక్స్ హడావిడి ..