తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త టీపీసీసీ చీఫ్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది..దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో నడుసుకుంటున్నారు … ప్రతిదీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు …
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని మంత్రివర్గ విస్తరణ లో జాప్యం ఏర్పడింది … అయితే దీనిపై కొందరు నేతలు తమకే మంత్రి అన్నట్లుగా రేవంత్ తో మంతనాలు జరుపుతుంటే ..? కానీ ఇంకా దీనిపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి .. సరైన నిర్ణయం తీసుకుంటారని టాక్ …జులై మొదటివారంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంతా భావించారు.కానీ మొత్తానికి బోల్తా పడింది ..
నిజానికి పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చల్లోనూ విస్తరణలో నాలుగు బెర్తులపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది అని తెలుస్తుంది … పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్లే నాయకుడి కోసం అన్వేషించింది.. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ తదితరులంతా సీరియస్ గా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ పదవి తనకు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినా దీనిపై క్లారిటీ లేదు … రేవంత్ ఎవరిని కనికరిస్తారో చూడాలి..
ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులందరిలో శ్రీధర్ బాబుకు సౌమ్యుడిగా పేరుంది. విపక్షాల విమర్శలను కూడా ఆయన సునిశితంగానే విమర్శిస్తున్నారు. పార్టీలోనూ కార్యకర్తలు, నేతలందరికి ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అందరికీ ఆమోదయోగ్యుడిగా శ్రీధర్ బాబు పేరే పీసీసీ రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.. గతంలో వైఎస్, డీఎస్ లా పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ పార్టీ శ్రేణులకు ఏకతాటిపై నడిపించడానికి శ్రీధర్ బాబు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించకపోవచ్చని సమాచారం. ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు గానీ, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా బహిరంగంగా ఎన్నడూ ఆయన వ్యక్తం చేయలేదు. మొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా అంశంలోనూ శ్రీధర్ బాబు పార్టీ అధిష్ఠానం సూచన మేరకు ఆయనతో చర్చలు చేసి సమస్యను జటిలం కాకుండా చూశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. . అందుకే అన్నిరకాలుగా ఆలోచించి పార్టీ అధిష్ఠానం శ్రీధర్ బాబు అయితేనే పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్తారని.. తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్పా తదుపరి పీసీసీ అధ్యక్షుడు శ్రీధర్ బాబే అని పార్టీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయ్యక తప్పదు..