పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఒక మార్క్ ఉంది … అయన సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి .. అయితే ఉద్యమ0 సమయం లో
పవన్ కల్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తీశాడు..ఆ సినిమా తెలంగాణ ఉద్యమం గురించి తీశారు … అప్పుడే తనపై వ్యతిరేకత వచ్చింది … ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంపై తనకున్న ఏహ్యభావాన్ని సినిమాలో దుష్టపాత్రలకు అన్వయించి ప్రదర్శించారు పూరీ జగన్నాథ్. తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమాపై నిరసనలు వెల్లువెత్తడంతో చాలా కేంద్రాల్లో ప్రదర్శన నిలిచిపోయింది.. ప్రేక్షకులు నిర్దంద్వంగా తిరస్కరించడంతో సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.. దానితో పవన్ కళ్యాణ్ మీద కూడా కాస్త వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి …
ఇదిలా ఉంటె పూరి జగన్నాథ్ పలు సందర్భంలో తెలంగాణతనాన్ని కించపరిచేలా హేళన చేసారు … అయితే ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ డబల్ తో రాబోతున్నాడు … ఈ సినిమాలోని ‘మార్ ముంత చోడ్ చింత..’ అనే పాటను విడుదల చేయగా అది విన్న తెలంగాణ ప్రజలు, కేసీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు.. పార్టీ సాంగ్ పేరిట విడుదల చేసిన ఈ ‘కల్లు కంపౌండ్’ పాటలో హీరో, హీరోయిన్ రామ్, కావ్యా థాపర్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు..
అయితే తెలంగాణ పోరాట నేతగా , రాజకీయనేతలకు స్ఫూర్తిగా నిలిచే కేసీఆర్ మాటలను ఈ పాటలో వాడి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశాడు పూరీ జగన్నాథ్.. దీనిపై ఫ్యాన్స్ రచ్చ అప్పుడే షురూ చేసారు … తెలంగాణ అనగానే మందుకొట్టుడే అనే పిచ్చి భావన కలిగించేలా చిత్రీకరించిన ఈ పాటలో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటను వాడి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ పూరీపై మండిపడుతున్నారు.
ఈ పాటలో కేసీఆర్ ‘హుక్‌లైన్’ను దురుద్దేశపూర్వకంగానే పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పాటను స్వరపరచింది మణిశర్మ కాగా, రాసింది కాసర్ల శ్యామ్. సినిమా పాటల విషయంలో దర్శకులదే అంతిమ నిర్ణయం ఉంటుంది. డైరెక్టర్ ఓకే చేసిన తర్వాతే పాటను విడుదల చేస్తారు. సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత పాలుపంచుకుంటారు. దర్శకుడి సూచనల మేరకే మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ పాటలో మార్పులు చేస్తారు.
అంటే ఈ పాటలోని హుక్‌లైన్‌ను పూరీ నిర్ణయం మేరకే పెట్టారని భావిస్తున్నారు. మరోవైపు గీత రచయిత కాసర్ల శ్యామ్‌పైనా సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…
తెలంగాణ ప్రాంతం వాడై ఉండి అలాంటి హుక్‌లైన్‌ను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాసర్ల శ్యామ్‌తోపాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా తెలంగాణ వాడే కావడాన్ని తెలంగాణవాదులు, ఇక్కడి సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.దీనిపై వాళ్ళు ఇంకా స్పందించలేదు … మాజీ సీఎం పై ఇంతటి సులకనగా భావం వ్యక్తం చేసారా అని తిట్టిపోస్తున్నారు …
కేసీఆర్ ఫ్యాన్స్ అయితే కొందరు ఈ పాటను ఎంజాయ్ చేస్తున్న.. మరికొందరు పూరి పై ఫైర్ అయ్యారు … మొత్తానికి పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించి దర్శకుడు పూరీ జగన్నాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.