వైసీపీ ఘోర అపజయం తరువాత జగన్ సీఎం టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు … అయితే అధికారంలో ఉన్న టీడీపీ కూటమి అభివృద్ధి పనుల్లో లీనమయిపోయింది … అందులో ఏపీ అసెంబ్లీ లో బడ్జెట్ కూడా అనుకూలంగా కేంద్రం వారికే నిధులు కేటాయించింది … చంద్రబాబు చేతికి పగ్గాలు వచ్చాక జగన్ అతని బ్యాచ్ చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు … అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయారు … ప్రజలు బుద్ది చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు … అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ అక్రమాలను ఒక్కొక్కటి బయటకి తీసే పనిలో ఉన్నారు … దానిలో భాగంగా పెద్దిరెడ్డి పై వేటు పడింది …. చేసిన తప్పులు ఊరికే పోతాయా … అనుభవించక తప్పదు అన్నట్లు వైసీపీ కి ఆ గతి పట్టింది …
అయితే పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో … ఆయనపై వేటు వేశారు .. అయితే ఆయన ఆయా ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపి.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి.. ఈ పిటిషన్ను హైకోర్టు..విచారణకు తీసుకుంది. తాజాగా జరిగిన విచారణకు ఇరు పక్షాల న్యాయవాదులు సహా పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజరయ్యారు. పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి. ఇంప్లీడ్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది..
మొత్తానికి పెద్దిరెడ్డి ఆస్తుల ఇవే :
142 భూములకు సంబంధించి రికార్డులు పెద్దిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్నాయి… ఈనాం భూములను తమ వారి పేరుతో రాయించుకున్నారు. వాటిని కూడా దాచి పెట్టారు.హైదరాబాద్, ఢిల్లీ, ఇతర విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తోంది.దక్షిణాఫ్రికాలో గనుల వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను వెల్లడించలేదు.
బెంగళూరులో విలాస వంతమైన భవనం, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. వాటి వివరాలను కూడా దాచి పెట్టారు.
పెద్దిరెడ్డిపై 12 కేసులు ఉండగా.. నాలుగు మాత్రమే ఉన్నాయని చూపించారు…
మొత్తానికి చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేసారు … వైసీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయింది …ఒక్కొక్కరిగా అందరి అంతు చూస్తారు బాబు … అంత ఈజీ గా వదిలిపెడతారా జైల్లో పెట్టి చిత్ర హింసలు చేసారు … సో చూద్దాం ఏమి జరుగుతుందో ..