కాలం మారుతున్నా కొద్దీ మారుతున్న జనరేషన్ … సోషల్ మీడియా ప్లేట్ ఫార్మ్ దొరికింది ప్రతి ఒక్కరు దాన్ని యూస్ చేసుకొని కొందరు దారుణాలు చేస్తున్నారు … మరికొందరు దాన్నితమ టాలెంట్ ను చూపించే పనిలో ఉన్నారు … దీనిలో భాగంగా కొని రోజుల క్రితం
తండ్రి, కూతుర్ల బంధంపై దారుణమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్.. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు .డార్క్ కామెడీ పేరుతో చెత్త కంటెంట్ తో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ యూత్ ని చెడగొట్టే ప్రయత్నం చేసిన ప్రణీత్ బాగోతాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది … రోజుకొక బండారం ప్రణీత్
గురించి బయటకొస్తుడ్ని . ప్రణీత్ హన్మంతు గంజాయి తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌లో గంజాయి సేవించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది…
ఇప్పటికే అతనిపై ఐటీ, పోక్సో యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 79, 294 కింద కేసు నమోదు చేశారు .. తాజాగా నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1985 కింద కొన్ని సెక్షన్లను జోడించారు. సోషల్ మీడియాలో తండ్రి, కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ర్ ప్రణీత్ హనుమంతుకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది… ఇదే కేసులో ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను ఉన్నారు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్ గూడ జైలు లో ఉన్నారు. మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ హనుమంతును శిక్షించాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆరోజు అతను మాట్లాడిన మాటలు తండ్రీకూతుళ్ల సంబంధానికి మచ్చ తెచ్చి పెట్టాయాని ఫైర్ అవుతున్నారు. . ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటకు రావడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది .. ప్రణీత్ కి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది సర్వత్రా ఆసక్తినెలకొని ఉంది ..అలాగే ఈ విషయంలో చాల పెద్ద సెలెబ్రెటీస్ కూడా రియాక్ట్ అయ్యి ప్రణీత్ పై విరిసుకుపడ్డారు … ప్రణీత్ కు తగిన శిక్ష పడాలని కోరారు … సోషల్ మద్యంనాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి … కానీ ప్రణీత్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నారని … వాటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కోరారు …