కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉంటారనీ, ఆమె మాట తీరు, నిర్ణయాలు తీసుకునే వేగం అన్నీ ఇందిరాగాంధీని గుర్తు చేస్తారని అందరు అంటుంటారు. అయితే ఇప్పటి వరకూ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంది చాలా తక్కువే.. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ చాలా తెలివైనది అలాగే రాజకీయాల్లో బాగా మాట్లాడగల సత్తా ఉంది … తన వాయిస్ వినిపిస్తే కాంగ్రెస్ కి ప్రియాంక గాంధీ మంచి ప్లస్ అవుతుంది … కాగా అయితే ఈ సారి మాత్రం ఆమె రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయింది.
మున్ముందు ప్రియాంకగాంధీయే ఇందిరాగాంధీ రాజకీయ వారసురాలిగా రాజకీయాలలో చక్రం తిప్పుతారన్న పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. వాయనాడ్ నుంచి ఆమె ఎన్నికైన క్షణం నుంచీ రాజకీయాలలో పెనుమార్పులకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యం ఆమె చేతుల్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రియాంక కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాగా సామాన్య జనంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరుసగా మూడు పరాజయాల తరువాత రాహుల్ గాంధీలో ఎంత పరిణితి కనిపిస్తున్నప్పటికీ పార్టీ మొత్తం ఆయన నాయకత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించడం లేదు.
అలాగే సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న పార్టీలు కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకూ ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీ కోసమే తన ప్రచారం, తన రాజకీయం అని చెబుతూ వస్తున్నారు. అంటే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్ తీసుకోవాలంటే అందుకు ముందుగా రాహుల్ గాంధీ ప్రతిపాదించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అదే సమయంలో రాహుల్ గాంధీకి ప్రధాని అవ్వాలన్న కాంక్ష కంటే బీజేపీ గద్దె దించాలన్న లక్ష్యమే బలంగా ఉందని, ఆ కారణంతో నిజంగా కాంగ్రెస్ బలోపేతానికి ప్రింయాక గాంధీ లీడ్ రోల్ పోషించాలని ఆయన కన్విన్స్ అయితే క్షణం ఆలోచించకుండా వెనక్కు తగ్గి ప్రియాంకను ముందు పీఠిన నిలబెడతారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో.